టాటా పంచ్ ICE vs పంచ్ EV.. వీటిలో ఏ కారు కొనాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా.??
టాటా మోటార్స్(Tata Motors) కార్ల పట్ల భారత కస్టమర్లలో విపరీతమైన ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని జనం ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఇటీవల టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా పంచ్ కారును కొనుగోలు చేయాలనుకునేవారు.. ఫ్యూయెల్‌తో నడిచే కారు, ఈవీ విషయంలో కొంత గందరగోళానికి గురవుతారు.
అత్యుత్తమ బిల్ట్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోడల్ కార్లు 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి. అందుకే దేశంలో టాటా కార్లకు డిమాండ్ ఎక్కువ. ఈ క్రమంలో మీరు కొత్తగా టాటా పంచ్(Tata Punch 2024) కారును కొనుగోలు చేయాలనుకుంటే.. ఇక్కడ ICE మరియు EV వెర్షన్‌ల గురించి వివరిస్తున్నాం. ఈ కథనం ద్వారా మీకు ఏ కారు సరైనదో తెలుసుకోవచ్చు.

డిజైన్ విషయానికొస్తే టాటా పంచ్ EV మరియు ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) వెర్షన్‌లు దేనికదే ప్రత్యేకమైన డిజైన్‌లను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. పంచ్ యొక్క ICE వెర్షన్ స్టెప్-డౌన్ DRLని కలిగి ఉండగా.. EV వెర్షన్ మరింత నిటారుగా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ హెడ్‌లైట్ డిజైన్‌ను చూసుకుంటే.. పంచ్ EV టాటా యొక్క కొత్త డిజైన్‌ను హారియర్ మరియు సఫారీని పోలి ఉంటుంది.
టాటా పంచ్ ఐసీఈ ముందు గ్రిల్ కూడా భిన్నంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే ICE వెర్షన్ ఇంజిన్ మరియు రేడియేటర్‌ను చల్లబరచడానికి గాలి సరఫరా చాలా అవసరం. అందుకోసం గ్రిల్ పెద్దగా ఉంటుంది. ఇక EV వెర్షన్‌లో దిగువన మాత్రమే తెరవబడి ఉంటుంది. ఇక రెండు కార్లలో వెనుక వైపు, ఎలక్ట్రిక్ పంచ్ యొక్క బూట్‌లో కనిపించే Punch.ev బ్యాడ్జింగ్ మినహా రెండూ ఒకేలా కనిపిస్తాయనే చెప్పవచ్చు.

ఇంటీరియర్ మరియు ఫీచర్లను పరిశీలిస్తే.. టాటా పంచ్ ICE వెర్షన్‌లో సింగిల్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కలర్ హైలైట్‌లతో కూడిన ఎయిర్ వెంట్స్, సెమీ-డిజిటల్ డ్యాష్‌బోర్డ్, స్పోక్ స్టీరింగ్ వీల్, సన్‌రూఫ్ ఇంకా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే పంచ్ EV.. Nexon EV మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండగా.. టచ్-ఆపరేటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ TFT స్క్రీన్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఇంకా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా ABS, EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ISOFIX సీట్ మౌంట్‌లు ఇంకా మరిన్ని ఫీచర్లను టాటా పంచ్ ICE, EV వెర్షన్లలో టాప్-స్పెక్ మోడల్‌లలో చూడవచ్చు. కాగా సేఫ్టీ పరంగా టాటా పంచ్ ICE వెర్షన్ ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే.. EVని కూడా అదే నాణ్యతా ప్రమాణాలతో రూపొందించారు.

టాటా పంచ్ ICE(Tata Punch ICE) వెర్షన్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఒకే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంజిన్ 87బిహెచ్‌పి పవర్ మరియు 115 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక CNG వెర్షన్ 72 bhp శక్తిని మరియు 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక టాటా పంచ్(Tata Punch EV) యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సంస్థ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ప్రవేశపెట్టింది. మొదటిది 25kWh బ్యాటరీ ఆప్షన్. ఇది 315 km రేంజ్‌ను ఇస్తుంది. 13.5 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇక రెండవ బ్యాటరీ ప్యాక్ 35 kWh యూనిట్, ఇది 421 km రేంజ్‌ను ఇస్తుండగా.. కేవలం 9.5 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఇవి ఈ రెండు కార్ల మధ్య వ్యత్యాసాలు. చివరగా ఏ కారును కొనుగోలు చేయాలనేది.. కస్టమర్ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ICE వెర్షన్‌తో పోలిస్తే.. EV వెర్షన్ నగర అవసరాలు, తక్కువ దూరం జర్నీలకు అనువుగా ఉంటుంది. అదే విధంగా పంచ్ ఈవీ కారు ఫీచర్లు, ఇతరత్రా మరింత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఇక కస్టమర్ తన అవసరాలకు అనుగుణంగా నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








