ప్రతీ నెలా టాప్‌లో ఉండే ఈ మైక్రో ఎస్‌యూవీ ధర తగ్గింది.. కేవలం ఈ నెల ఆఖరు వరకే ఆఫర్!
గత రెండు నెలలుగా మార్కెట్‌లో టాటా కార్ల అమ్మకాలు తగ్గాయి. అయితే ఈ నెలలో పండుగ సీజన్ ఉండటంతో సేల్స్ పెంచుకునేందుకు ఆ కంపెనీ యత్నిస్తోంది. ఈ సంస్థ నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉన్న టాటా పంచ్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడువతున్న మోడల్‌గా ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచింది. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న మారుతి వ్యాగన్‌ఆర్‌ని కాదని జనాలు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోనే హై సేఫ్టీ, మంచి బిల్డ్ క్వాలిటీలో పాపులారిటీ కలిగిన సంస్థగా పేరొందిన టాటా మోటార్స్ పండుగ సీజన్ కోసం 2024 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని (Tata Punch Facelift) లాంచ్ చేసింది.
ఈ టాటా కారు మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనే ఎక్కువ అమ్ముడవుతున్న మోడల్‌గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇటీవలె సిట్రోయిన్ సీ3, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో పోల్చితే ఇది మెరుగైన ఫీచర్లతో ఆ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ టాటా పంచ్ ఆగస్టు 2024 వరకు మొత్తం 4 లక్షల యూనిట్ల పంచ్ ఎస్‌యూవీలను విక్రయించి కొత్త రికార్డును నెలకొల్పింది.

టాటా పంచ్ ప్రతీ నెల టాప్-10లో కొనసాగుతుంది. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా మంచి అమ్మకాలతో దూసుకెళ్తుంది. మంచి ఫీచర్లు, తక్కువ ధరతో సహా మెరుగైన పనితీరు అందించే శక్తివంతమైన ఇంజిన్‌తో ఇది వినియోగదారులకు దగ్గరవుతోంది. 2024 లో అప్‌డేటెడ్ చేసిన టాటా పంచ్ ఎస్‌యూవీ మధ్యతరగతికి వారికి తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది. ఈ పంచ్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్‌ని టాటా ప్రకటించింది.
ఈ పాప్‌లర్ 2024 టాటా పంచ్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లపై, అలాగే 2023 పంచ్ మోడల్‌పై కూడా రూ .15,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 3000 కార్పొరేట్ బెనిఫిట్స్‌ని కూడా పొందవచ్చు. ప్రస్తుతం టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉంది. దీంతో ఈ కారుని ఈ నెల ఆఖరి వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

పైన చెప్పిన విధంగా తాజాగా విడుదలైన అప్‌డేటెడ్ 2024 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సిట్రోయిన్ సీ3, హ్యుందాయ్ ఎక్స్‌టర్ లంకేట ఇది ఎక్కువ ఫీచర్లు, అప్‌డేట్స్‌ని కలిగి ఉంది. 2024 పంచ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్ యుఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక భాగంలో ఏసీ వెంట్స్‌ని కలిగి ఉంటుంది. కాస్మోటిక్ మార్పులు ఏమి జరగలేదు. దీని రాకతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది.
ఫీచర్ల పరంగా వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, ముందు భాగంలో ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. టాటా పంచ్ ప్యూర్, ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ ప్లస్ ఎస్, అన్ కాంప్లికేటెడ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్ అనే వేరియంట్లలో లభిస్తుంది.

టాటా పంచ్ ఎస్‌యూవీలో 1.2-లీటర్, త్రీ-సిలిండర్, NA పెట్రోల్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం ఏడు వెర్షన్లలో లభించే ఈ కారు సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. కొత్త టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ పాత పంచ్ మాదిరిగానే 87 bhp పవర్, 115 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. చిన్న కుటుంబాలకు ఈ కారు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








