మారుతి సుజుకికి బిగ్ షాక్.. వరుసగా రెండు సార్లు బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ప్రముఖ కంపెనీ కారు
భారత మార్కెట్లో కార్ల అమ్మకాలు ప్రతి నెలా ఊపందుకుంటున్నాయి. కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడటంతో మెల్లగా ఆటో మొబైల్ రంగం ఊపందుంకుంటోంది. ఈ క్రమంలో ప్రతి నెలా కార్ల సేల్స్‌లో మారుతి సుజుకి కార్లు టాప్ 1 లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం గత 2 నెలలుగా మారుతి సుజుకికి ఓ ప్రముఖ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది.
ఏప్రిల్ నెలలో జరిగిన కార్ల సేల్స్‌లో ఈ సారి కూడా మారుతీయేతర కారు బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అయితే ఇది నెక్సాన్, క్రెటా, సెల్టోస్, మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ అనుకుంటే పొరపాటే. గత రెండు నెలలుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా టాటా మోటార్స్(Tata Punch)కు చెందిన ప్రముఖ కారు స్థానం దక్కించుకుంది.

సాధారరణంగా ప్రతి నెలా సేల్స్ పరంగా మారుతి సుజుకి(Maruti Suzuki Sales) కారు ఒక నెలలో బెస్ట్ సెల్లర్ కాకపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ సారి మాత్రం మారుతీ సుజుకి కారు వరుసగా రెండు నెలలుగా బెస్ట్ సెల్లర్ కాకపోవడం మొదటిసారి చోటుచేసుకుంది. మారుతి సుజుకి ఆధిపత్యానికి ఇది ఊహించని బ్రేక్ అని చెప్పవచ్చు.
అయితే మీరు ఈ టాప్ కారు టాటా పంచ్(Tata Punch Sales In April) అంటే నమ్ముతారా.?? స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన మైక్రో-SUV టాటా పంచ్.. ఈ సారి సేల్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. Micro-SUV టాటా పంచ్ అత్యధిక ప్రజాదరణ పొందిన కారుగా నిలిచింది.

కాగా టాటా పంచ్ మార్చి 2024లో 17,547 యూనిట్లు విక్రయించబడటంతో.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా స్థానం సంపాదించుకుంది. అయితే ఏప్రిల్ 2024లో 19,158 యూనిట్ల సేల్స్‌తో మళ్లీ తన దూకుడు కొనసాగించింది. కాగా టాటా పంచ్ అంతర్గత దహన యంత్రం (ICE) మరియు ఎలక్ట్రిక్ వెర్షన్(EV) రూపంలో విక్రయించబడుతోంది.
ఇక టాటా పంచ్ ICE వెర్షన్ ధర మార్కెట్లో రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.20 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. ఇందులో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 88 PS పవర్ మరియు 115 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా పంచ్ ఐసీఈ ఇంజిన్ 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో జత చేయబడి ఉంటుంది. అయితే ఇందులో 5-స్పీడ్ MTతో జతచేయబడిన CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 73 PS మరియు 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ CNG గ్యాస్ ఇంధనం కోసం ట్విన్ ట్యాంక్‌లతో పొందుపరిచింది.
ఇక టాటా పంచ్ ఈవీ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఇది 60kW మోటార్‌తో పనిచేస్తుంది. 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 25 kWh బ్యాటరీ ప్యాక్ 315 km రేేంజ్ ఇస్తుంది.

టాటా పంచ్ ఈవీలోని మరో వేరియంట్ 90kW మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 421km రేంజ్ అందిస్తుందని సంస్థ తెలిసింది. ఇది లాంగ్ రేంజ్ వేరియంట్.
కాగా టాటా మోటార్స్‌కు టాటా పంచ్ మరియు టాటా నెక్సాన్ గణనీయమైన సేల్స్‌ను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఏకంా 1,70,076 యూనిట్ల టాటా పంచ్‌లను విక్రయించింది. ఇదే వేగంతో దూసుకెళ్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మైలురాయిని దాటుతుందనడంలో సందేహం లేదు. హ్యుందాయ్ ఎక్స్‌టర్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి పంచ్ గట్టి పోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








