రూ.6 లక్షలకే లభిస్తున్న కారు.. సేఫ్టీలో 5 స్టార్.. దీనికోసం పండుగలా కిక్కిరిసిపోయిన షోరూమ్..
ఇండియాలో అత్యుత్తమైన సేఫ్టీ ప్రమాణాలతో కార్లను తయారు చేసే కంపెనీగా టాటా మోటార్స్ (Tata Motors)కు పేరున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే విక్రయాల పరంగా టాటా ప్రతి ఏటా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తూనే ఉంది. ఇటీవల ముగిసిన పండగ సమయంలో కూడా ఇతర కంపెనీల కంటే కూడా ఎక్కువ విక్రయాలను సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కస్టమర్ల నుంచి మంచి ఆదరణ సంపాదించిన టాటా పంచ్ కారు అమ్మకాల డేటాను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్ 2024 నెలలో పంచ్ ఎస్‌యూవీ (Punch Suv)ని 15,435 మంది కొనుగోలు చేశారు. అదే గత ఏడాది (2023) ఇదే నెలలో మొత్తం విక్రయాలు 14,383గా ఉన్నాయి. ఈ లెక్కన చూసినట్లయితే గత ఏడాదితో పోలిస్తే పంచ్ విక్రయ వృద్ధి 7 శాతం పెరగడం గమనార్హం.
భారతీయ కస్టమర్లలో టాటా పంచ్ పట్ల ఉన్న డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవంబర్ 2024లో దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 SUV కార్ల లిస్ట్‌లో ఈ పంచ్ కారు ఏకంగా రెండో స్థానం పొందింది. సమీక్ష నెలలో ఈ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు షోరూమ్‌లకు ఎగబడినట్లు డేటాను చూస్తేనే తెలిసిపోతుంది. దీనికి ముందు ఈ జాబితాలో మరో దిగ్గజ కారు ఉంది.

నవంబర్ 2024లో దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ హ్యూందాయ్‌కు చెందిన క్రెటా కారు అగ్రస్థానంలో ఉంది. ఈ ఎస్‌యూవీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు డేటా వెల్లడిస్తుంది. ఈ నెలలో హ్యుందాయ్ క్రెటా కారు మొత్తం విక్రయాల సంఖ్య దాదాపు 15,452 యూనిట్లతో టాప్-10 SUV కార్ల లిస్ట్‌లో మొదటి స్థానం సంపాదించింది. టాటా పంచ్ దీని తర్వాత రెండో ప్లేస్‌లో ఉంది.
నివేదిక ప్రకారం, నవంబర్ నెలలో టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా మధ్య అమ్మకాల తేడా కేవలం 17 యూనిట్లు మాత్రమే. స్వల్ప తేడా కూడా రానున్న రోజుల్లో మరింత తగ్గిపోయే అవకాశం ఉందని టాటా కంపెనీ భావిస్తోంది. రాబోయే కొత్త ఏడాదిలో ఈ రెండింటి మధ్య విక్రయాల పరంగా తీవ్రమైన పోటీ ఉండవచ్చని తెలుస్తోంది. ఎస్‌యూవీ విభాగంలో పంచ్ బాగా డిమాండ్ కారుగా అవతరించడంతో కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది.

ఇండియాలో టాటా పంచ్ కారు ఎలక్ట్రిక్, IC ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అదే హ్యుందాయ్ క్రెటా మాత్రం IC ఇంజిన్ వెర్షన్‌లో కొనుగోలుకు ఉంది. దీంతో టాటా పంచ్ ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ కావడానికి అవకాశం లభించినట్లయింది. కస్టమర్లు సాధారణ ఇంజిన్ వేరియంట్లనే కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్లను సైతం ఎక్కువగానే కోరుకుంటున్నారు. దీంతో ఈ డిమాండ్ టాటా పంచ్‌కు బాగా కలిసివచ్చింది.
అదే క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లభించకపోవడం వలన మరిన్ని ఎక్కువ విక్రయాలను సాధించలేకనపోయింది. ఒకవేళ ఈవీలో కూడా ఈ కారు లభించినట్లయితే దేశంలోనే ఎస్‌యూవీ విక్రయాల్లో హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇటీవల వచ్చిన ప్రకటన ప్రకారం, క్రెటా ఈవీ వెర్షన్ త్వరలో విడుదల కాబోతుంది. దీంతో ఈ కొత్ మోడల్ మరిన్ని అమ్మకాలను సాధించే అవకాశం ఉంది.

ఇండియా మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ధర రూ.6.13 లక్షల నుంచి మొదలవుతుంది. తక్కువ ధరలో లభించడం వలన మధ్య తరగతి వారు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పైగా ఈ ఎస్‌యూవీ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికుల సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్‌సీఎపీ క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5-స్టార్ రేటింగ్ సాధించింది.


Click it and Unblock the Notifications








