మూడేళ్ళలో 4 లక్షల మంది కొన్న కారు ఇదే!.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు
భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగిన మరియు చాలామందికి నమ్మికైన బ్రాండ్ టాటా మోటార్స్ (Tata Motors). ఇందులో 'పంచ్' మైక్రో ఎస్‌యూవీ అనేది సేఫెస్ట్ కార్లలో ఒకటి. కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ కారును 2021లో లాంచ్ చేసింది. సంస్థ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కేవలం మూడేళ్ళలో 4 లక్షల విక్రయాలను చేపట్టగలిగింది. దీన్ని బట్టి చూస్తే టాటా పంచ్ ఎస్‌యూవీకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టాటా కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే అత్యుత్తమ అమ్మకాలను పొందిన ఈ టాటా పంచ్ ఎస్‌యూవీ.. చూడగానే ఆకర్శించే డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ధర కూడా దాని ప్రత్యర్థుల కంటే కొంత తక్కువే. ఈ కారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ రూపంలో మాత్రమే కాకుండా.. ఐసీఎన్‌జీ రూపంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కేవలం 10 నెలల కాలంలోనే 1 లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది. అంటే పది నెలల్లో లక్ష మంది ఈ కారును కొనుగోలు చేశారన్నమాట. ఆ తరువాత కూడా దీని అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కంపెనీ కూడా కస్టమర్ల కోసం దీనిని సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. దీంతో అదే ఏడాది 2 లక్షల అమ్మకాల మైలురాయిని పంచ్ అవలీలగా ఛేదించింది.
2023 డిసెంబర్ నాటికి పంచ్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత కాలంలో (2024 జనవరి) ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. ఇలా కంపెనీ కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా ఎప్పటికప్పుడు మారుతున్న కాలంలో వీటిని అప్డేట్ చేస్తూ.. ప్రజలకు మరింత చేరువ చేయడానికి నిరంతరం శ్రమించింది. దీంతో సంస్థ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.

దేశంలో టాటా మోటార్స్ యొక్క సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం క్రమంగా వృద్ధి చెందుతూనే ఉంది. ఇందులో టాటా పంచ్ 68 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ఈ వృద్ధికి టాటా పంచ్ ఈవీ కూడా దోహదపడింది. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలు గణనీయంగా పెరగటానికి టాటా పంచ్ చాలా సహకరించింది. నేటికీ ఈ కారును ఇష్టపడే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు అంటే అతిశయోక్తి కాదు.
టాటా పంచ్ ఈవీ అనేది కొత్త ఈవీ ఆర్కిటెక్చర్ యాక్టీ.ఈవీపై నిర్మించబడిన మొదటి మోడల్. టాటా పంచ్ యొక్క మొత్తం అమ్మకాల్లో 53 శాతం పెట్రోల్ కార్లు, 33 శాతం సీఎన్‌జీ కార్లు మరియు 14 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎక్కువ సంఖ్యలో పెట్రోల్ కార్లు అమ్ముడైనట్లు స్పష్టమవుతోంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందింది.

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, డిజైర్, స్విఫ్ట్ మరియు బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టాటా పంచ్.. నెలవారీ అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్ల జాబితాలో కూడా సుదీర్ఘ కాలం నిలిచింది. ఇలా ప్రారంభం నుంచి టాటా పంచ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే తన విభాగంలో గణనీయమైన అమ్మకాలను పొందగలిగింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








