సేఫ్టీలో 5 స్టార్, సేల్స్‌లో నంబర్ 1.. 26.99 కి.మీ మైలేజీ ఇచ్చే అత్యంత చౌకైన కారు ఇదే!
గత కొన్ని రోజులుగా భారత్‌లో సేఫ్టీ ఎక్కువగా ఉన్న కార్లను జనాలు కొనుగోలు చేస్తున్నారు. హై-సేఫ్టీ ఫీచర్లు, క్రాష్ టెస్ట్ ఫలితాల తర్వాతే కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే భారత్‌లో సేఫ్టీలో రారాజుగా టాటా కార్లు ఉన్నాయి. దేశంలో లభించే ఇతర కార్ బ్రాండ్లతో పోల్చితే టాటా కార్లు తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి. తక్కువ ధరకే వినియోగదారులకు మంచి నాణ్యమైన కార్లను అందిస్తున్నందున అమ్మకాల్లోనూ ఈ కంపెనీకి చెందిన కార్లు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి.
జూలై నెలలోనూ టాటా కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న టాటా పంచ్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఫర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పాలి. దీనిని కొనేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీంతో సేల్స్‌లో టాప్‌లో కొనసాగుతుంది. 3 ఏళ్లలో ఈ కారు 4 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ కారులో లభించే స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఈ కథనంలో..

ప్రస్తుతం దేశంలో కార్ల వినియోగం పెరుగుతుంది. మిడిల్ క్లాస్ కుటుంబాలు సైతం కార్లను ఎక్కువగా కొంటున్నారు. దీంతో కార్ల తయారీ సంస్థలు అందుబాటు ధరలో కార్లను అందిస్తున్నాయి. వీటిలో టాటా మోటార్స్ ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న టాటా పంచ్ (Tata Punch) ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ప్రస్తుతం సేల్స్‌లో ఈ కారు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
2024 ప్రథమార్థంలో (జనవరి-జూన్) అమ్మకాల్లో టాప్ 10 స్థానాల్లో ఎస్‌యూవీలు నిలువగా.. ఆ తర్వాతి స్థానాల్లో హ్యాచ్‌బ్యాక్స్, ఆ తర్వాతి స్థానాల్లో ఎంపీవీలు నిలిచాయి. ప్రతి నెలా అమ్మకాల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలించింది. మైక్రో SUV విభాగంలో 2024 మొదటి అర్ధభాగంలో 1.10 లక్షల యూనిట్ల అమ్మకాలతో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది.

గత ఏడాది ఇదే సమయానికి ఈ కారు కేవలం 67,117 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత సంవత్సరంతో పోల్చితే టాటా పంచ్ 64 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్ పవర్ట్రెయిన్ వాటా 53 శాతం కాగా, సీఎన్‌జీ వేరియంట్లు 33 శాతం, ఎలక్ట్రిక్ పంచ్ వెర్షన్స్ 14 శాతం సేల్ అయ్యాయి.
ఇంజిన్: ఇది 1.2-లీటర్ 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 86 ps పవర్‌ని మరియు 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. ఇక సీఎన్‌జీ ఆప్షన్‌లో కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 20.09 కి.మీ, సీఎన్‌జీ ఆప్షన్‌లో 26.99 కి.మీ మైలేజీని అందిస్తుంది.

టాటా పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 315 నుంచి 425 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. టాటా పంచ్ ప్రారంభ ధర రూ .6.13 లక్షలు నుంచి టాప్ ఎండ్ మోడల్ ధర రూ .10.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇక సీఎన్‌జీ వేరియంట్స్ ధర రూ .7.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 10.99 నుంచి రూ. 15.49 లక్షల మధ్య ఉంది. ఈ కారు NCAP, BNCAP క్రాష్ టెస్ట్‌ల్లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఇక పంచ్ కారులో 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్, ఇబిడి, టీపీఎంఎస్, రివర్సింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








