దేశంలో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో విడుదల కానున్న తొలి CNG వాహనాలు ఇవే..!!

భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లతోపాటు CNG వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా ఈ తరహా వాహనాల తయారీపై దృష్టిపెడుతున్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata CNG cars) తన సీఎన్‌జీ వాహనాలకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

దేశంలోనే ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయ్‌ : ఈ టీజర్‌ ఆధారంగా టాటా టియాగో, టాటా టిగోర్‌ CNG వాహనాలు తొలిసారిగా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను (Tata CNG with Automatic variants) కలిగి ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సీఎన్‌జీ కార్లు విడుదల కానున్నాయి. దేశంలోనే ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న సీఎన్‌జీ వాహనాలుగా టాటా టిగోర్‌ సీఎన్‌జీ, టాటా టియాగో సీఎన్‌జీ వాహనాలు గుర్తింపు పొందనున్నాయి.

 tata-tigor-icng-car

ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న వాహనాలుగా : ఈ వాహనాల XT మరియు XZ+ వేరియంట్‌లు ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. టాటా టియాగో సీఎన్‌జీ, టాటా టిగోర్‌ సీఎన్‌జీ వాహనాలు ప్రస్తుతం 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి.

టాటా టిగోర్‌ ఇంజిన్ 85 bhp శక్తి, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సీఎన్‌జీ మోడ్‌లో 72bhp శక్తి, 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ వాహనాలు 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. త్వరలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి.

, tata tiago and tigor cng cars with automatic transmission

టాటా టియాగో సీఎన్‌జీ ప్రస్తుత ధర, మైలేజీ : టాటా టియాగో, టిగోర్‌ ICNG వాహనాలు ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో టాటా టియాగో సీఎన్‌జీ ప్రారంభ ధర రూ.6.55 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అదే హైఎండ్‌ మోడల్‌ ధర రూ.8.20 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ కారు 26.40 కి.మీ/కేజీ మైలేజీని ఇస్తుంది.

టాటా టిగోర్‌ సీఎన్‌జీ ధర, మైలేజీ : అదే టాటా టిగోర్‌ సీఎన్‌జీ వాహనం ప్రారంభ ధర రూ.7.80 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.8.95 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ వాహనం 26.49 కి.మీ/కేజీ మైలేజిని ఇస్తుంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులోకి వస్తే మైలేజీలో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

tata tiago and tigor cng cars teaser

టాటా టియాగో సీఎన్‌జీ మరియు టాటా టిగోర్‌ సీఎన్‌జీ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రత్యేకంగా మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి డిజైర్‌ మరియు హ్యుందాయ్‌ ఆరాతో పోలిస్తే టియాగో, టిగోర్‌ సీఎన్‌జీ మంచి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఆటోమేటిక్‌ వేరియంట్లు అందుబాటులోకి వస్తే గణనీయ విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 24, 2024, 12:38 [IST]
English summary
Tata tiago and tigor cng cars are said to be first automatic variants in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+