ఆ ఎలక్ట్రిక్ కారుపై బంపర్ ఆఫర్.. 6 నెలలు ఛార్జింగ్ ఫ్రీ, రూ. 75,000 వరకు బెనిఫిట్స్.. లిమిటెడ్ ఆఫర్!
దేశంలో ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం టాటా కార్లు అనేలా ఆ సంస్థ కస్టమర్లకు పూర్తి విశ్వాసాన్ని కల్పించింది. దాదాపు భారత్‌లో ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ని శాసిస్తున్న కంపెనీగా టాటా మోటార్స్ ఉంది. అయితే వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఈ టాటా కార్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఎంజీ మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఉంది. ప్రస్తుతం దేశంలో సాంప్రదాయ డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ కార్లతో పాటు ఈవీలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ అన్ని విభాగాల్లో టాటా మోటార్స్ సత్తా చాటుతోంది.
ఇటీవలె కాలంలో ఈ కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా తిరిగి మళ్లీ గాడిలో పడే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే భారీ ప్రణాళికలను టాటా ప్రారంభించింది. తాజాగా ఆ కంపెనీ లైనప్స్‌లోని టియాగో ఈవీ నుంచి కర్వ్ ఈవీ వరకు ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్స్‌పై పండుగ సీజన్‌ని పురస్కరించుకుని అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.

ఇక ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా టియాగో ఈవీ తొలి స్థానంలో ఉంది. దీనిని ఓ బేస్ వేరియంట్ ఈవీ కారుగా పరిగణించవచ్చు. అందువల్ల జనాలు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ కారుపై భారీ ఆఫర్‌ని టాటా ప్రకటించింది. ఈ నెలలో టాటా టియాగో ఈవీని కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ .75,000 విలువైన ఆఫర్‌ని అందిస్తోంది.
దీంతో పాటు టాటా పవర్ స్టేషన్‌లో 6 నెలల ఉచిత ఛార్జింగ్ సౌకర్యం అందించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు దగ్గరలోని అధీకృత డీలర్‌షిప్స్‌ని సందర్శించి బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రత్యేక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ .7.99 లక్షల నుంచి రూ .11.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది. త్వరలోనే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)ను అందించే అవకాశం కూడా ఉంది. దీంతో కిలోమీటర్‌కి తక్కువ మొత్తంలో అద్దె చెల్లించి ఈ కారుని సొంతం చేసుకోవచ్చు. ఈ సర్వీస్ వల్ల దీని ధర కూడా భారీగా తగ్గుతుంది.
ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. రెండు యూనిట్లు లిక్విడ్-కూల్డ్‌తో అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. మల్టీ మోడ్ ఫోర్ లెవల్ రీజనరేషన్ బ్రేకింగ్‌తో ఈ మోడల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. మిడిల్ రేంజ్ వెర్షన్లలోని 19.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. మీడియం రేంజ్ టియాగో 6.2 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్-రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మీడియం-రేంజ్ వేరియంట్లు 60 bhp వద్ద 110 nm టార్క్‌ని లాంగ్ రేంజ్ వెర్షన్లు 73 bhp వద్ద 114 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ టియాగో ఈవీ సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రెస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లమ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని బ్యాటరీ ప్యాక్, మోటార్‌పై 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్లు ఉంటుందని టాటా మోటార్స్ హామీ ఇచ్చింది. అదే సమయంలో ఈ వెహికిల్‌పై 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








