ఈ ఎలక్ట్రిక్ కారుతో మీ ఇంట్లో తిప్పలు తప్పినట్లే.. మీ ఖర్చులు విపరీతంగా తగ్గుతాయి!
మన కంఫర్ట్ కోసమైనా.. నలుగురిలో మెప్పు పొందడం కోసమైనా కారు కొనడం ఈ మధ్య కామన్ అయిపోయింది. లక్షలు పోసి కారు కొన్నా సరే.. ఫ్యూయల్ ఖర్చుల కారణంగా దాన్ని మెయింటెయిన్ చేయడం భారంగా ఫీలవుతుంటారు చాలామంది. అయితే... ఇలాంటి బాధల నుంచి కాస్త రిలీఫ్ కలిగించేందుకు ఓ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. అదే టాటా టియాగో ఈవీ. తక్కువ ధరలో మంచి మైలేజీతో ఉండే ఈ ఈవీ ప్రత్యేకతలేంటో చూసేద్దాం..
ఈ ఈవీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని ధర రూ. 8 లక్షలు ఉంటే చాలు దీన్ని సొంతం చేసుకోవచ్చు. కాంపాక్ట్ డిజైన్, ఎఫీషియంట్ పర్ఫార్మెన్స్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనేందుకు ఈ మధ్య చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంట్లో ఇంకా ఏమేం ఫీచర్లున్నాయంటే...

ఫీచర్లు: టాటా టియాగోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, 4-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, నాలుగు ట్వీటర్‌లు ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలను కూడా ఇది అందిస్తుంది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు హాయిగా వెళ్లొచ్చు. దీని కాంపాక్ట్ డిజైన్‌తో ఇరుకు రోడ్లపైనా ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు. కాస్త తక్కువ స్పేస్ ఉన్నా సరే దీన్ని పార్కింగ్ చేసేయొచ్చు.
పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రొనస్ మోటార్‌తో వచ్చే ఈ కారు XE, XT, XZ Plus, XZ Plus టెక్ వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంది.

టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వెర్షన్లోని 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం దూసుకెళ్తుంది. 24 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండే లాంగ్ రేంజ్ వేరియంట్‌లో అయితే ఏకంగా 315 కి.మీ.ల వరకు ప్రయాణించొచ్చు.
దీని మీడియం-రేంజ్ Tiago EV 6.2 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకోగలదు. ఇక లాంగ్-రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 kmph వేగంతో ప్రయాణిస్తుంది. Tiago EV మీడియం-రేంజ్ వేరియంట్ గరిష్ఠంగా 60 bhp వద్ద 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో లాంగ్-రేంజ్ వెర్షన్లు 73 bhp వద్ద 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి.
ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే... ఈ హ్యాచ్‌బ్యాక్ ఛార్జింగ్ సమయం.. మనం ఉపయోగించే ఛార్జర్‌పై ఆధారపడి ఉంటుంది. 10 నుంచి 100 శాతం ఛార్జింగ్ కోసం 15A సాకెట్ ఛార్జర్‌తో 19.2 kWh బ్యాటరీకి 6.9 గంటలు పడితే.. 24 kWh బ్యాటరీకి 8.7 గంటలు పడుతుంది. 3.3 kW AC ఛార్జర్‌కి కూడా ఇంతే టైం తీసుకుంటుంది.
ఇక 7.2 kW AC ఛార్జర్‌పై. 2.6 గంటలు, 3.6 గంటల సమయం ఆదా అవుతుంది. 10 నుంచి 80 శాతం ఛార్జ్ కోసం డీసీ ఫాస్ట్ ఛార్జర్ వినియోగిస్తే మాత్రం కేవలం 58 నిమిషాలు పడుతుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఈవీ కోసం చూస్తున్నట్లయితే.. ఇంకెందుకాలస్యం టాటా టియాగో EVపై ఓ లుక్కేయండి. పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పండి.


Click it and Unblock the Notifications








