ఇది కదా ఆఫర్ అంటే.. Tiago EV కొనటానికి ఇదే మంచి సమయం! ఎందుకంటే?
టాటా టియాగో EV కొనాలని ఎదురు చూస్తున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. టియాగో ఈవీ కొనుగోలుపై కస్టమర్ గరిష్టంగా రూ.70000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కథనంలో ఏ వేరియంట్ మీద ఎంత డిస్కౌంట్ లభిస్తుందనే వివరాలు తెలుసుకుందాం.
కంపెనీ ధరలను తగ్గించిన తరువాత టియాగో ఈవీ XE MR వేరియంట్ మీద గరిష్టంగా రూ. 70000 డిస్కౌంట్ లభిస్తుంది. దీని రూ. 8.69 లక్షల వద్ద లభించే ఈ కారు డిస్కౌంట్ తరువాత రూ. 7.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. XT MR కొనుగోలుపై రూ. 35000, XT LR వేరియంట్ మీద రూ. 20000 తగ్గింపు లభిస్తోంది.

టాటా టియాగో యొక్క XZ ప్లస్ LR, XZ ప్లస్ టెక్ లక్స్ LR, XZ ప్లస్ LR (7.2 కిలోవాట్ ఛార్జర్) మరియు XZ ప్లస్ టెక్ లక్స్ LR (7.2 కిలోవాట్ ఛార్జర్) వేరియంట్ల మీద కంపెనీ రూ. 20000 తగ్గింపును మాత్రమే అందిస్తుంది. అంటే ఇప్పుడు ఈ వేరియంట్ల ధరలు మునుపటి ధరల కంటే రూ. 20000 తక్కువగా ఉంటాయి.
టియాగో ఈవీ 19.2 కిలోవాట్ బ్యాటరీ మరియు 24 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. 19.2 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ చార్జితో 250 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 61 హార్స్ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారుకు జతచేయబడి ఉంటుంది. 24 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ చార్జితో 315 కిమీ అందిస్తూ.. 75 హార్స్ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కంపెనీ ప్రస్తుతం తన టియాగో ఈవీ మీద మాత్రమే కాకుండా.. నెక్సాన్ ఈవీ మీద కూడా రూ. 25000 నుంచి గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఇప్పుడు నెక్సాన్ ఈవీ యొక్క అన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం కొత్త ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ మరియు టియాగో ఈవీ కొనాలనుకునే వారు కంపెనీ అందిస్తున్న ఈ తగ్గింపులతో కొనేయొచ్చు.
నిజానికి టాటా మోటార్స్ మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎంజీ మోటార్స్ కంపెనీ కూడా తన కామెట్ ఈవీ మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్ల మీద డిస్కౌంట్స్ అందించడానికి ప్రధాన కారణం బ్యాటరీ సెల్స్ ధరలు తగ్గడమే అని తెలుస్తోంది. ఈ తగ్గింపులు ప్రస్తుతం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

దేశీయ దిగ్గజం టాటా టియాగో ఈవీ మీద ధరలను తగ్గించినప్పటికీ.. అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే టాటా టియాగో ఈవీ ధర కంటే (రూ. 7.99 లక్షలు). ఎంజీ కామెట్ ఈవీ ధర (రూ. 6.99 లక్షలు) ఏకంగా ఒక లక్ష రూపాయలు తక్కువ. కావున ఈ రకమైన పోటీని టియాగో ఈవీ ఎదుర్కోవాల్సి ఉందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








