Tata Tigor iCNG AMT Full Review Video టాటా టిగోర్ ఐసీఎన్‌జీ ఏఎంటీ ఫుల్ రివ్యూ వీడియో
టాటా మోటార్స్ Tigor iCNGని 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అప్‌డేట్ చేసి గత నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో ఇది దేశంలోనే మొదటి CNG ఆటోమేటిక్ సెడాన్‌గా నిలిచింది. కాగా టిగోర్ ఐసీఎన్‌జీ ఆటోమేటిక్ వెర్షన్‌ను టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌ను టాటా మోటార్స్ ఆహ్వానించింది. ఈ కారు పనితీరు, డిజైన్, ఫీచర్లు పూర్తి రివ్యూ వీడియో ఈ కథనంలో..
డిజైన్ విషయానికొస్తే టాటా టిగోర్ iCNG AMT అదే హెడ్‌లైట్, ఫాగ్‌లైట్ సెటప్‌తో పాటు ముందు భాగంలో అదే LED DRL లను చూడవచ్చు. పార్కింగ్‌లో ఇబ్బంది తలెత్తకుండా.. గుడ్ క్వాలిటీ రివర్స్ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇంటీరియర్ పరంగా AMT గేర్ లివర్ మినహా టిగోర్ iCNG క్యాబిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ మాదిరిగానే ఫీచర్లు ఉంటాయి.
టాటా టిగోర్ iCNG AMT అదే 1.2-లీటర్ Revotron పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CNG మోడ్‌లో 73.4PS శక్తిని మరియు పెట్రోల్ మోడ్‌లో 86PS శక్తిని ఉత్పత్తి చేస్తుండగా.. గరిష్ఠ టార్క్ అవుట్‌పుట్ 95 NM వద్ద అలాగే ఉంటుందని గమనించాం. ప్రస్తుతం ఈ ఇంజిన్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంది. AMT గేర్‌బాక్స్‌ను పనితీరు కొంచెం నెమ్మదిగా ఉన్నా తన విధులను సక్రమంగా నిర్వహిస్తోంది.

కాగా టాటా టిగోర్ ఐసీఎన్‌జీ ఆటోమేటిక్ మోడ్‌లోని అప్‌షిఫ్ట్‌లు నిజంగా లాగీగా అనిపించినా.. ఫ్లిప్ సైడ్‌లో, మీరు మాన్యువల్ మోడ్‌కి మారిన తర్వాత, డౌన్‌షిఫ్ట్‌లలో రియాక్షన్ కొద్దిగా పెరుగుతుంది. కాగా కారు లీనియర్ యాక్సిలరేషన్ మరియు మంచి టాప్ ఎండ్‌ను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇక టాటా టిగోర్ iCNG AMT సస్పెన్షన్ సెటప్ అలాగే ఉంటుంది. కానీ సాధారణ పెట్రోల్ టియాగో కంటే భిన్నంగా ఉండటాన్ని గమనించాం.


Click it and Unblock the Notifications








