Tata కారుకు తగ్గిన వెయిటింగ్‌ పిరియడ్‌.. ప్రారంభ ధర రూ.6.30 లక్షలు.. గరిష్ఠ మైలేజీ 19.60 కి.మీ..!!

భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టాటా మోటార్స్‌కు చెందిన హ్యాచ్‌బ్యాక్‌, SUVలకు అధిక డిమాండ్‌ ఉంది. దీంతోపాటు ఈ వాహనాల ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్ల కారణంగా అనేక మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే Tata Tigor కంపాక్ట్ సెడాన్‌ వెయిటింగ్‌ పిరియడ్‌ గురించి తాజా సమాచారం అందుబాటులో ఉంది.

టాటా టిగోర్‌ కారును నాలుగు వారాల్లోనే డెలివరీ పొందవచ్చు. అయితే ప్రాంతం, రాష్ట్రం, డీలర్‌ ఆధారంగా వెయిటింగ్‌ పిరియడ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలోని డీలర్‌ను సంప్రదించండి. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఏంటి, ధర, వేరియంట్లు వంటి కీలక వివరాలతో కూడిన పూర్తి కథనం మీకోసం.

 tata-tigor-car

టాటా టిగోర్‌ ధర : టాటా టిగోర్‌ 4 వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.30 లక్షలుగా ఉంది. హైఎండ్ మోడల్‌ ధర రూ.8.95 లక్షలుగా ఉంది. ఈ కంపాక్ట్‌ సెడాన్‌ మాగ్నెటిక్‌ రెడ్‌, అరిజోనా బ్లూ, ఒపాల్ వైట్‌ సహా రంగుల్లో అందుబాటులో ఉంది.

టాటా టిగోర్‌ కంపాక్ట్‌ సెడాన్‌ పెట్రోల్‌, CNG ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 86ps శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

 tata-tigor-waiting period

సీఎన్‌జీ వేరియంట్‌ కూడా పెట్రోల్‌ తరహా ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ సీఎన్‌జీవో 73.5ps శక్తి, 95Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌ 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. టాటా టిగోర్‌ పెట్రోల్‌ వేరియంట్లు లీటర్‌కు 19.28 కి.మీ నుంచి 19.60 కి.మీ మైలేజీని ఇస్తాయి. సీఎన్‌జీ వేరియంట్లు 26.49 km/kg మైలేజీని ఇస్తుంది.

ఈ కంపాక్ట్‌ సెడాన్‌ 7- అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లే, పుష్ బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్‌లు, కీలెస్‌ ఎంట్రీ, ఆటోమేటిక్‌ AC, సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. టాటా టిగోర్‌ వాహనం.. మారుతి సుజుకి డిజైర్‌, హ్యుందాయ్‌ ఆరా, హోండా అమేజ్‌ వంటి కార్లతో పోటీపడుతోంది.

 tata-tigor-interior

టాటా టిగోర్‌ వాహనం మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (EBD), యాంటీలాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ (ABS), రియర్ పార్కింగ్ సెన్సార్లు సహా మరిన్ని సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ వెయిటింగ్‌ పిరియడ్‌తో అందుబాటులో ధరకే టాటా టిగోల్‌ అందుబాటులో వచ్చింది. అయితే డిమాండ్‌ను బట్టి వెయిటింగ్‌ పిరియడ్‌లో మార్పులుండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, January 8, 2024, 18:27 [IST]
English summary
Tata tigor waiting period upto 4 months in january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+