లాంచ్‌కు సిద్దమవుతున్న Tata Curvv - తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
భారతీయ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి 'టాటా కర్వ్' (Tata Curvv) సర్వత్రా సిద్ధమౌతోంది. అయితే మనం ఈ కథనంలో ఈ కొత్త టాటా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటనే సంగతులు ఇక్కడ చూసేద్దాం.
ఎప్పుడు లాంచ్ అవుతుందంటే?
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన కొత్త కర్వ్ SUVని ఈ ఏడాది మధ్యలో ఎప్పుడైనా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే మరో ఆరు నెలల్లో కంపెనీ ఈ కారుని మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. లాంచ్ డేట్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది.

డిజైన్ & ఫీచర్స్
విడుదలకు సిద్దమవుతున్న టాటా కర్వ్ చూడటానికి కొంత నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగా అనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్‌కి కొత్త హెడ్‌ల్యాంప్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్‌లు హారియార్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగా అనిపిస్తాయి. అయితే గ్రిల్ మరియు లైసెన్స్ ప్లేట్ హోసింగ్ మధ్య అడిషనల్ ఎయిర్ వెంట్ కనిపిస్తుంది. వింగ్ మిర్రర్స్ డోర్‌లపైన అమర్చబడి ఉండటం చూడవచ్చు. ఇందులో కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉండటం గమనించవచ్చి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ SUVలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే వంటి వాటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్లు, రియర్ ఏసీ వెంట్స్, పవర్ డ్రైవర్ సీటు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో వైపర్, అధునాతన ADAS ఫీచర్స్ ఉండననున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

పవర్‌ట్రెయిన్
నిజానికి టాటా కర్వ్ అనేది ప్రారంభంలో ఎలక్ట్రిక్ వెర్షన్లో విక్రయానికి రానున్నట్లు సమాచారం. కర్వ్ ఈవీ ఒక ఫుల్ చార్జిపై 450 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని, ఇది AWD ఆప్షన్ కూడా పొందుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అనుకున్నట్లుగానే టాటా కర్వ్ ఈవీ మార్కెట్లో అడుగుపెడితే.. నెక్సాన్ ఈవీ మాదిరిగా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వెర్షన్ పక్కన పెడితే.. ఇది 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజిన్ 125 bhp పవర్ మరియు 225 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ పొందే అవకాశం ఉంది. డీజిల్ ఇంజిన్ నెక్సాన్ డీజిల్ వెర్షన్ మాదిరిగా ఉండవచ్చని సమాచారం.

డైమెన్షన్ మరియు ప్రత్యర్థులు
రాబోయే టాటా కర్వ్ పరిమాణం పరంగా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఈ SUV పొడవు 4308 మీమీ, వెడల్పు 1810 మిమీ, ఎత్తు 1630 మిమీ, వీల్‌బేస్ 2560 మీమీ మరియు బూట్ స్పేస్ 422 లీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ టాటా కర్వ్ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








