ఇండియాలో ఫస్ట్ టెస్లా షోరూమ్ ఎక్కడో తెలిసిపోయింది..! అదృష్టం అంటే వాళ్లదే..
ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు క్రమంగా ముగింపు పలుకుతూ ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారత ప్రజలు కూడా ఈవీల వైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఇక్కడి మార్కెట్లో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ బిజినెస్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశ జనాభా ఎక్కువ ఉండటం కారణంగా వ్యాపారం అధికంగా జరుగుతుందని అంచనా వేస్తూ కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి ధోరణిని మార్చుకుని ఈవీలపై దృష్టి సారించి ఈ విభాగంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అమ్మకాల పరంగా బాగా క్లిక్ అయిన మోడళ్లను ఈవీలుగా అప్‌డేట్ చేసి విడుదల చేయడంతో పాటు, కొత్త డిజైన్‌తో ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ఈవీల పట్ల మంచి ఆదరణ వస్తుండటంతో తయారీదారులు కూడా వీటిపై ఫోకస్ పెంచారు.
దేశీయంగా వాహన తయారీ పరిశ్రమలో అగ్ర సంస్థలుగా ఉన్నటువంటివి ఈవీలను మార్కెట్లోకి అధికంగా విడుదల చేసి ఈ సెగ్మెంట్‌లో ఎక్కువ వాటాను ఆక్రమించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు భారత్‌లో వస్తున్న ఆదరణను గమనించిన అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. దీని కోసం భారత ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. కేంద్రం కూడా ఈవీలను ప్రోత్సహిస్తుంది.

వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా వాతావరణాన్ని కాపాడవచ్చని ఈవీ తయారీదారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలు అందిస్తుంది. దేశీయ కంపెనీలకే కాకుండా ఇతర దేశాల కంపెనీలకు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రాయితీలు వంటి వాటిని ఆఫర్ చేస్తుంది. చాలా కంపెనీలు ఇప్పటికే వీటిని సద్వినియోగం చేసుకుని పలు రాష్ట్రాల్లో ఈవీ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మొదటి స్థానంలో ఉండే ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ భారత మార్కెట్‌పై కన్నేసి ఇక్కడి లోకల్ కంపెనీలకు ప్రత్యర్థిగా నిలవడానికి తన కార్లను భారత్‌లోకి తీసుకురావడానికి కీలక ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం గతంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రధాని మోడీ అమెరికా వెళ్లినప్పుడు మస్క్ ఆయనను కలిసి భారత్‌లో ఈవీ పెట్టుబడులపై చర్చించారు.

భారత్‌లో ఈవీలకు మంచి భవిష్యత్తు ఉందని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరగా అందుకు అధికారులు స్పందించి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే టెస్లా పన్నుల విషయంలో ఎక్కువ రాయితీని అడుగుతుండగా, కేంద్రం అందుకు అంగీకారం తెలపకపోవడంతో ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన మధ్యలోనే ఆగిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన ఈవీ పాలసీకి కట్టుబడి ఉండాలని టెస్లాకు కేంద్రం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే మరోసారి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టెస్లా ఇండియాలో షోరూమ్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్థలం కోసం అన్వేషణ చేస్తుంది. ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం, దక్షిణ ఢిల్లీలోని DLFకి చెందిన అవెన్యూ మాల్ అలాగే, గుర్గావ్‌లోని సైబర్‌హబ్‌తో పాటు ఇతర ఏరియాల్లో కొత్త ఈవీ షోరూమ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తుంది.
టెస్లా ప్రతినిధులు 3,000 - 5,000 చదరపు అడుగుల స్థలం కోసం చూస్తున్నారు. దేశ రాజధానిలో డెలివరీతో పాటు సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. అయితే DLFకి చెందిన అవెన్యూ మాల్‌లో స్పెయిన్‌కు చెందిన మ్యాంగో, జపాన్‌కు చెందిన యునిక్లో వంటి కంపెనీలు ఉండగా, ఇక్కడే టెస్లా షోరూమ్ ఏర్పాటుపై ఆసక్తి కనబరుస్తుంది. కొత్త కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా భారత మార్కెట్‌లో పట్టు సాధించాలని టెస్లా చూస్తుంది.


Click it and Unblock the Notifications








