ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్‌లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL)కి చెందిన కార్లకు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ఈ సంస్థకు చెందిన కార్లు ప్రతీనెలా 6 నుంచి 7 కార్లు టాప్-10 జాబితాలో చోటు సంపాదిస్తాయి. ఈ కంపెనీ నుంచి మరీ ముఖ్యంగా వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఎప్పుడూ టాప్-5 జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ కార్లుగా ఉన్నాయి.
మారుతి కార్లు(Maruti Cars) బడ్జెట్ ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ కంపెనీ అందించే కార్లు పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్లతో అధిక మైలేజీని అందిస్తున్నాయి. అయితే, ఈ కార్ల భద్రతా రిజల్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టాప్ కార్ల జాబితాలో ఉన్న వ్యాగన్ ఆర్, స్విఫ్ట్‌లతో పాటు ఆల్టో కె10 కార్లు గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో తేలిపోయాయి. ఈ కార్లు భద్రతా విషయంలో మాత్రం జీరో రేటింగ్‌ని సాధించాయి.

మారుతి వ్యాగన్ ఆర్ 1-స్టార్ సేఫ్టీ రేటింగ్: మార్కెట్లో మారుతి సుజుకి నుంచి అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కార్లలో వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో ఉంటుంది. మారుతి వ్యాగన్ ఆర్ 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో 2,00,177 యూనిట్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో, మారుతి నుంచి అత్యధికంగా అమ్ముడైన కారుగా వ్యాగన్ ఆర్ నిలిచింది. అయినప్పటికీ, దాని భద్రతా రేటింగ్ ప్రజలను ఒకింత నిరాశకు గురిచేస్తోంది.
వాస్తవానికి మారుతి Wagon R.. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ సేఫ్టీ విభాగంలో 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇక పిల్లల భద్రత విభాగంలో అయితే 0-స్టార్ రేటింగ్‌తో ఉంది. కాగా మార్కెట్లో వ్యాగన్ ఆర్ ప్రారంభ ధర రూ. 5,54,500(ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ ఇంజిన్‌తో లీటరుకు 25.19 కి.మీ, సీఎన్‌జీతో కిలోకు 33.47 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.

మారుతి స్విఫ్ట్ 1-స్టార్ సేఫ్టీ రేటింగ్: మార్కెట్లో మారుతి స్విఫ్ట్ కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాగన్ ఆర్ తర్వాత ఎక్కువగా అమ్ముడవతున్న కారు ఇదే. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 1,95,312 స్విఫ్ట్ యూనిట్లను విక్రయించింది. కానీ సేఫ్టీ పరంగా మాత్రం కస్టమర్లను అంచనాలను అందుకోలేకపోయింది.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ సేఫ్టీ విభాగంలో Maruti Swift.. 1-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు ఛైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 1-స్టార్ రేటింగ్‌ను సాధించింది. మార్కెట్లో స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 5,99,450(ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో లీటరుకు 22.56 కి.మీ మరియు సీఎన్‌జీతో కిలోకు 30.90 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.

మారుతి ఆల్టో కె 10 1-స్టార్ సేఫ్టీ రేటింగ్: మారుతి నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉన్న మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు Alto K10. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,11,955 యూనిట్లను విక్రయించడంతో మోస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఈ కారు కూడా ఉంది. అయితే దీని సేఫ్టీ రేటింగ్ కూడా నిరాశాజనకంగానే ఉంది.
Global NCAP Crash Test లో అడల్ట్ సేఫ్టీ విభాగంలో Alto K10 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు పిల్లల భద్రత విభాగంలో 0-స్టార్ రేటింగ్‌తో ఉంది. మార్కెట్లో ఆల్టో కె 10 ప్రారంభ ధర రూ. 3.90 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ ఇంజిన్‌తో లీటరుకు 24.90 కి.మీ మరియు సీఎన్‌జీతో కిలోకు 33.85 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








