ఆటోలను ఎక్కువగా కొంటున్నారు.. షాక్‌కి గురిచేస్తున్న సేల్స్‌ రిపోర్ట్‌.. తక్కువ బడ్జెట్‌ ఎక్కువ లాభాలు

దేశంలో ఆటోల వినియోగం పెరుగుతుంది. అందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లతో సమానంగా త్రిచక్ర వాహనాల అమ్మకాలు కూడా అంతే మొత్తంలో కొనసాగుతున్నాయి. మధ్య తరగతి వాళ్లు వీటి ద్వారానే ఇంకా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో వీటిని వినియోగించే కస్టమర్ల సంఖ్య పెరగడం, ఇతర అగ్రిగేటర్ల రూపంలో సరుకుల రవాణా, కమర్షియల్‌ వినియోగం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా భారత్‌లో ఆటో సేల్స్ కొన్ని నెలలుగా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత జూన్‌లో భారతదేశంలో ఎన్ని ఆటోలు విక్రయించబడ్డాయి అనే వివరాలను మనం వివరంగా చూడబోతున్నాము.

ప్రతిరోజూ వేలాది మంది ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. భారతదేశంలో ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ముఖ్యంలో సిటీల్లో ఆటోలు విరివిగా కనిపిస్తాయి. అందువల్ల ఈ ఆటో పరిశ్రమ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఈ కారణంగా భారతదేశంలో ఆటోల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జూన్‌లో భారతదేశంలో ఆటో అమ్మకాల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ కంపెనీ ఆటోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తదితర అంశాలు ఈ కథనంలో..

Top-10 Auto-Sale-In-June

త్రిచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటోదే ఆధిపత్యం. ఒక్క జూన్ నెలలోనే 34,000 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. ఇది భారతదేశంలో అతిపెద్ద త్రిచక్ర వాహన తయారీదారుగా ఉంది. కొన్నేళ్లుగా ఈ సంస్థ నంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఆ తర్వాత పియాజియో రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ మొత్తం 6850 త్రిచక్ర వాహనాలను విక్రయించింది.

ఆ తర్వాత 5449 యూనిట్‌ సేల్స్‌తో మహీంద్రా మూడో స్థానంలో ఉంది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు కంపెనీల ద్వారా మహీంద్రా మొత్తం 5,449 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత నాలుగో కంపెనీ వైసీ ఎలక్ట్రిక్ ఉంది. ఈ కంపెనీ 3355 ఆటోలను అమ్మింది. భారత్‌లో ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.

Bajaj-maxima-Auto-Sales

ద్విచక్ర వాహనంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో స్కూటర్ ఎంత అభివృద్ధి చెందిందో, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కూడా అంతే పెరుగుతోంది. ఐదో స్థానంలో సిరా ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇది జూన్‌లో మొత్తం 2471 వాహనాలను విక్రయించింది. అబ్దుల్ ఆటో లిమిటెడ్ ఆరో స్థానంలో ఉంది. ఈ కంపెనీ 2022 త్రీ వీలర్ యూనిట్‌ సేల్స్‌తో ఆ స్థానంలో ఉంది.

ఇక ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఏడో స్థానంలో ఉంది. జూన్‌లో ఈ కంపెనీ 1,963 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఎనిమిదో స్థానంలో ఉంది. కంపెనీ మొత్తం 1746 త్రిచక్ర వాహనాలను విక్రయించి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది.

Mahindra-Treo-Auto-Sales

మినీ మెట్రో ఈవీ LLP 9వ స్థానంలో ఉంది. జూన్‌లో కంపెనీ 1,296 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. యూనిక్ ఇంటర్నేషనల్ 10వ స్థానంలో ఉంది. కంపెనీ మొత్తం 1174 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. మొత్తానికి ఒక్క జూన్ నెలలోనే 94 వేల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2024, 13:26 [IST]
English summary
Top 10 auto sales in june bajaj still top in this segment with 34000 unit sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+