రాకెట్ కంటే వేగంగా అమ్ముడుపోతున్న కారు ఇదే.. 120 రోజుల్లోనే 72,466 యూనిట్లు కొనేశారు!
కార్ల తయారీ సంస్థలు జూలై నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడైన సెగ్మెంట్‌గా నిలిచాయి. ఈ నెల 14న విడుదల చేసిన సియామ్ (SIAM) గణాంకాల ప్రకారం మొత్తం 13.6 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఎస్‌యూవీలు, ఎంపీవీల అమ్మకాలు 8,68,132 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాలను గత ఏడాదితో పోలిస్తే 2 శాతం సేల్స్ పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీలు, ఎంపీవీల విక్రయాలు 63 శాతంగా ఉన్నాయి.
మహీంద్రా 3XO: 2024 ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌౦-10 కార్లలో 10 వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ నాలుగు నెలల్లో మొత్తం 32,501 కార్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా XUV 300 2023 లో 19,814 యూనిట్లు మాత్రమే అమ్మకాలను నమోదు చేసింది. ఇప్పుడు దాని అమ్మకాలు 64 శాతం పెరిగాయి. ఈ కారు గంటలోనే 55,000 బుకింగ్స్‌ని సాధించింది.

కియా సోనెట్ & గ్రాండ్ విటారా: మొత్తం 34,609 కార్లు సేల్స్‌తో సోనెట్ 9వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో కేవలం 29,962 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. మారుతి గ్రాండ్ విటారా 8వ స్థానంలో ఉంది. ఈ సమయంలో మొత్తం 36,463 కార్లు అమ్ముడవ్వగా 2023లో 36,154 కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమ్మకాలు ఒక శాతం పెరిగాయి.
హ్యుందాయ్ వెన్యూ & మారుతి ఫ్రాంక్స్: మొత్తం 37,177 యూనిట్లతో వెన్యూ 7వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో 42,223 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం దీని అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. మారుతికి చెందిన ఫ్రాంక్స్ ఆరో స్థానంలో ఉంది. మొత్తం 47,580 కార్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే సమయంలో 39,858 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు 19 శాతం పెరిగాయి.

టాటా నెక్సాన్ & మహీంద్రా స్కార్పియో: 48,593 యూనిట్ల సేల్స్‌తో నెక్సాన్ 5వ స్థానంలో ఉంది. 2023లో ఇదే సమయంలో 55,601 కార్లను విక్రయించింది. అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 53,068 యూనిట్లతో మహీంద్రా స్కార్పియో 4వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 38,105 యూనిట్లను విక్రయించింది. అమ్మకాలు 39 శాతం పెరిగాయి.
మారుతి బ్రెజా & హ్యుందాయ్ క్రెటా: మొత్తం 59,147 యూనిట్లతో మారుతి బ్రెజా 3వ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 52,355 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమ్మకాలు 13 శాతం పెరిగాయి. హ్యుందాయ్ క్రెటా రెండో స్థానంలో ఉంది. ఈ కారు మొత్తం 63,752 యూనిట్లను విక్రయించింది. 2023లో 57,144 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు 12 శాతం పెరిగాయి.

టాటా పంచ్: టాటా పంచ్ కారు మొదటి స్థానంలో ఉంది. గత నాలుగు నెలల్లో మొత్తం 72,466 కార్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే సమయంలో కేవలం 45,067 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. పంచ్ కారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎస్‌యూవీల్లో మిడ్ సైజ్ కార్ల కంటే కాంపాక్ట్ ఎస్‌యూవీలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎస్‌యూవీలు కొనాలనే కోరిక ప్రజల్లో ఉంది. అదే సమయంలో తక్కువ బడ్జెట్ ఉన్న కార్లను కొనాలనుకునే ప్రజలు ఈ కార్లను ఇష్టపడతారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








