ఫిబ్రవరిలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!.. జాబితా ఇదిగో..

భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ కథనంలో గత నెలలో(ఫిబ్రవరి) దేశీయ విఫణిలో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్-10 కార్లు ఏవి, వాటి సేల్స్ ఎన్ని అనే వివరాలు చూసేద్దాం..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి యొక్క 'వ్యాగన్ఆర్' (Wagon R) గత నెలలో మంచి అమ్మకాలను సాధించిన జాబితాలో అగ్రస్థానం పొందింది. కంపెనీ ఈ కారును మొత్తం 19412 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు 2023 ఫిబ్రవరి (16889 యూనిట్లు) నెల కంటే కూడా 14.94 శాతం ఎక్కువ. టాప్ 10 జాబితాలో ఈ కారు 12.03 శాతం వాటాను కలిగి ఉంది.

Maruti WagonR

టాటా పంచ్

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క 'పంచ్' 2024 ఫిబ్రవరిలో కూడా అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. దీంతో టాప్ 10 జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో టాటా పంచ్ సేల్స్ 18438 యూనిట్లు. ఈ అమ్మకాలు 2023 ఫిబ్రవరి కంటే కూడా 65.08 శాతం ఎక్కువ. అంటే గత ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ 11169 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.

మారుతి సుజుకి బాలెనొ

జాబితాలో మూడో స్థానంలో నిలిచిన మోడల్ మారుతి సుజుకి యొక్క బాలెనొ (Baleno). కంపెనీ ఫిబ్రవరి 2024లో ఏకంగా 17517 యూనిట్ల బాలెనొ కార్లను విక్రయించింది. ఈ సేల్స్ గత ఏడాది ఫిబ్రవరి కంటే కూడా 5.78 శాతం తక్కువ (-5.78%). అంటే 2023 ఫిబ్రవరిలో బాలెనొ అమ్మకాలు 18592 యూనిట్లు. నెలవారీ అమ్మకాలు తగ్గినప్పటికీ టాప్ 10 జాబితాలో మాత్రం 10.85 శాతం వాటాను పొందగలిగింది.

Maruti Baleno

మారుతి సుజుకి డిజైన్

2024 ఫిబ్రవరి నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన టాప్-10 కార్ల జాబితాలో మారుతి సుజుకి యొక్క డిజైన్ నాలుగవ స్థానంలో నిలిచింది. డిజైన్ మొత్తం అమ్మకాలు గత నెలలో 15837 యూనిట్లు. ఈ అమ్మకాలు 2023 ఫిబ్రవరి కంటే 5.72 శాతం తక్కువగా ఉన్నాయి. అంతే 2023 ఫిబ్రవరిలో డిజైన్ సేల్స్ 16.787 యూనిట్లు. అయితే టాప్-10 సేల్స్ జాబితాలో ఈ కారు 9.81 శాతం వాటాను కలిగి ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా

మారుతి సుజుకి యొక్క బ్రెజ్జా కూడా ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 జాబితాలో ఒకటి. దీని స్థానం ఐదు. గత నెలలో బ్రెజ్జా మొత్తం సేల్స్ 15765 యూనిట్లు. ఈ కారు సేల్స్ 2023 ఫిబ్రవరి నెలలో 15787 యూనిట్లు. అంటే 2023 కంటే 2024లో బ్రెజ్జా సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అమ్మకాల పరంగా 0.48 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

Maruti Ertiga

మారుతి సుజుకి ఎర్టిగా

అత్యధిక అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా ఆరవ స్థానంలో ఉంది. కంపెనీ గత నెలలో మొత్తం 15519 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. 2023 ఫిబ్రవరి నెల అమ్మకాలతో పోలిస్తే గత నెల అమ్మకాలు 139.79 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే గత ఏడాది ఫిబ్రవరిలో ఎర్టిగా సేల్స్ 6472 యూనిట్లు మాత్రమే.

హ్యుందాయ్ క్రెటా

2024 ఫిబ్రవరిలో హ్యుందాయ్ యొక్క క్రెటా అమ్మకాలు 15276 యూనిట్లు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో క్రెటా ఏడవ స్థానం పొందింది. 2023 ఫిబ్రవరిలో క్రెటా సేల్స్ 10421 యూనిట్లు మాత్రమే. అంటే మునుపటి ఏడాదికంటే ఈ ఏట అమ్మకాలు 46.59 శాతం పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే 2023 కంటే కూడా 2024లో క్రెటా సేల్స్ పెరిగాయని తెలుస్తోంది.

Mahindra Scorpio N

మహీంద్రా స్కార్పియో / స్కార్పియో ఎన్

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క స్కార్పియో కూడా గత నెలలో ఉత్తమ అమ్మకాలు పొంది టాప్ 10 కార్ల జాబితాలో ఎనిమిదవ స్థానం పొందింది. స్కార్పియో / స్కార్పియో ఎన్ అమ్మకాలు 2024 ఫిబ్రవరిలో 15051 యూనిట్లు. కాగా 2023 ఫిబ్రవరి నెలలో స్కార్పియో సేల్స్ 6950 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే 2023 కంటే 2024లో అమ్మకాలు 116.56 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

టాటా నెక్సాన్

భారతదేశంలో ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ గత నెలలో కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది. 2024 ఫిబ్రవరి నెలలో టాటా నెక్సాన్ అమ్మకాలు 14395 యూనిట్లు. ఈ సేల్స్ 2023 ఫిబ్రవరిలో 13914 యూనిట్లు. ఈ లెక్కన అమ్మకాలు మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.46 శాతం వృద్ధిని నమోదయ్యాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్

జాబితాలో చివరి మోడల్ మారుతి సుజుకి యొక్క ఫ్రాంక్స్. నిజానికి ఈ కారు 2023 ఏప్రిల్ నెలలో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందు సాగుతోంది. ఇందులో భాగంగానే ఈ మోడల్ గత నెలలో కూడా 14168 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. అంతే కాకుండా టాప్ 10 సేల్స్ జాబితాలో ఇది 8.78 శాతం వాటాను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2024, 11:00 [IST]
English summary
Top 10 car sales in 2024 february maruti wagon r to fronx
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+