జనవరిలో ఎక్కువమంది ఈ కార్లనే కొన్నారు! - టాప్ 10 మోడల్స్ ఇవే..

Top 10 Car Sales in India: 2024 ప్రారంభమై అప్పుడే ఒక నెల (జనవరి) పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో వాహన సంస్థలు గత నెల అమ్మకాల జాబితాలను విడుదల చేశాయి. ఇందులో మారుతి సుజుకి కంపెనీ అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేయగా.. టాటా మోటార్స్ తరువాత స్థానంలో నిలిచింది. ఈ కథనంలో 2024 జనవరిలో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్లు ఏవి? అగ్రస్థానంలో నిలిచిన మోడల్ ఏది? ఈ జాబితాలోకి కొత్త వాహనాలు చేరాయా.. అనే మరిన్ని వివరాలు చూసేద్దాం..

గత నెలలో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్లలో 7 మారుతి సుజుకి కంపెనీకి చెందినవే ఉండటం గమనార్హం. మిగిలిన వాటిలో రెండు టాటా కార్లు, ఒక మహీంద్రా కారు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారతీయ మార్కెట్లో మారుతి కార్లకు ఎంత డిమాండ్ ఉంది, ఏ స్థాయిలో అమ్మకాలు పొందుతోందో స్పష్టంగా అర్థమైపోతోంది.

Maruti Baleno

మారుతి బాలెనొ (Maruti Baleno)

గత కొంత కాలంగా మంచి అమ్మకాలను పొందుతున్న మారుతి బాలెనొ 2024 ప్రారంభంలో కూడా ఊహించని స్థాయిలో అమ్ముడైంది. జనవరిలో బాలెనొ అమ్మకాలు మొత్తం 19630 యూనిట్లు. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా సరికొత్త రికార్డ్ కైవసం చేసుకుంది. ఈ అమ్మకాలు 2023 జనవరి కంటే 20.01 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ కారుకు ఎక్కువమంది ఇష్టపడి మరీ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం బెస్ట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మాత్రం కాకుండా ఉత్తమమైన పర్ఫామెన్స్.

టాటా పంచ్ (Tata Punch)

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అమ్మకాల పరంగా ఆశాజనకంగానే ఉంది. సింపుల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ కారణాల వల్ల ఎక్కువమంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. టాటా పంచ్ 2024 జనవరిలో 17978 యూనిట్ల అమాంకాలతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2023 జనవరి కంటే 49.74 శాతం ఎక్కువ.

Maruti Wagon R

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)

జనవరి 2024లో ఎక్కువ అమ్మకాలు సాధించి మూడవ స్థానంలో నిలిచినా మోడల్ మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'వ్యాగన్ ఆర్'. ఈ కారు చాలామందికి ఇష్టమైన మోడల్. దీంతో వ్యాగన్ ఆర్ అమ్మకాలు గణనీయంగా ఉన్నాయి. 2023 జనవరి కంటే కూడా 13.24 శాతం ఎక్కువ అమ్మకాలు సాధించిన, వ్యాగన్ ఆర్ సేల్స్ 2024 జనవరిలో 17756 యూనిట్లు. ఇది కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

భారతదేశంలో ఎక్కువ మంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేసే టాటా కారులో నెక్సాన్ చెప్పుకోదగ్గ మోడల్. మంచి సేఫ్టీ ఫీచర్స్, ఉత్తమమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిన ఈ టాటా నెక్సాన్ గత నెలలో (2024 జనవరి) 17182 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. 2023 జనవరి కంటే ఈ అమమకాలు 10.37 శాతం ఎక్కువ. టాటా నెక్సాన్ ఇప్పటికే డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది త్వరలో సీఎన్‌జీ రూపంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Maruti Dzire

మారుతి డిజైర్ (Maruti Dzire)

మన జాబితాలో ఉత్తమ అమ్మకాలు పొందిన ఐదవ మోడల్ మారుతి డిజైర్. ఈ కాంపాక్ట్ సెడాన్ 2024 జనవరిలో 16773 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. ఈ సేల్స్ 2023 జనవరి కంటే 48.21 శాతం ఎక్కువని తెలుస్తోంది. స్విఫ్ట్ ఆధారంగా రూపొందించబడిన ఈ మోడల్ ప్రస్తుతం కంపెనీకి ఉత్తమ అమ్మకాలను తీసుకురావడంలో సహాయపడుతోంది.

మారుతి స్విఫ్ట్ (Maruti Swift)

మారుతి సుజుకి అంటే చాలామందికి గుర్తొచ్చే కారు స్విఫ్ట్. గత కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైన అమ్మకాలు పొందుతున్న ఈ కారు గత నెలలో కూడా 15370 యూనిట్లు అమ్ముడైంది. దీంతో భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన ఆరవ కారుగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 జనవరి అమ్మకాలు 2023 జనవరి అమ్మకాల కంటే 6.51 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

Maruti Brezza

మారుతి బ్రెజ్జా (Maruti Brezza)

ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన బ్రెజ్జా ఏడవ స్థానం పొందింది. గత నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 15303 యూనిట్ల బ్రెజ్జా కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి కంటే కూడా 6.57 శాతం ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం. మారుతి బ్రెజ్జా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించడం వల్ల ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

మారుతి ఎర్టిగా (Maruti Ertiga)

మూడు వరుసల సీట్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి ఎర్టిగా అమ్మకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. గత నెలలో ఈ MPV మొత్తం అమ్మకాలు 14632 యూనిట్లు, 2023 జనవరిలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ సేల్స్ ఏకంగా 50.07 శాతం అధికం. అంతే కాకుండా ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఏకంగా 10 లక్షల యూనిట్లు అమ్ముడైంది. ఇది అమ్మకాల్లో మారుతి సాధించిన అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)

అత్యధిక అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన కారు మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో. గత నెలలో మహీంద్రా స్కార్పియో SUV 14293 యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ అమ్మకాలు 2023 జనవరి కంటే 64.00 శాతం అధికం. మంది డిజైన్ మరియు ఫీచర్స్ వంటివి మాత్రమే కాకుండా అద్భుతమైన పనితీరుని అందిస్తూ.. ఆఫ్ రోడింగ్ ప్రియులకు సైతం అనుకూలంగా ఉండటం వల్ల ఈ కారు ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.

మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx)

గత ఏడాది ఏప్రిల్ 23 భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి కొత్త కారు 'ఫ్రాంక్స్' అమ్మకాల్లో 10వ స్థానంలో నిలిచింది. ఈ SUV అమ్మకాలు గత నెలలో 13643 యూనిట్లు. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఫ్రాంక్స్ అమ్మకాల్లో టాప్ 10 జాబితాలో చేరింది అంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Sunday, February 11, 2024, 15:00 [IST]
English summary
Top 10 car sales in india 2024 january
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+