డిసెంబర్‌లో మారుతి బ్రాండ్‌కు షాకిచ్చిన ప్రముఖ కారు.. ఈ సారి టాప్ 1 ప్లేస్ ఈ కారుదే.!!
2023 డిసెంబర్ నెల ముగియడంతో, ఇప్పుడు అన్ని కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్(Top 10 Cars In December)లో అమ్మకాల డేటాను వెల్లడించాయి. కాగా ప్రతి నెలా టాప్‌లో దూసుకుపోయే మారుతి బ్రాండ్ కారుకు ఈ సారి టాటా పెద్ద షాక్ ఇచ్చింది. మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్‌లో విక్రయించబడిన టాప్ 10 కార్ల జాబితా ఈ కథనంలో..
టాటా నెక్సాన్: డిసెంబర్‌లో విక్రయించబడిన టాప్ 10 కార్లలో టాటా నెక్సాన్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇటీవల ఈ కారు Tata Nexon Facelift విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో ఈ కారు అత్యధిక సంఖ్యలో అమ్ముడైంది. మొత్తంగా టాటా మోటార్స్ 15,284 కార్లను విక్రయించింది. 2022 డిసెంబర్‌లో 12,053 కార్లు సేల్ అవ్వగా.. ఈ సారి 27 శాతం వృద్ధిని సాధించింది.

మారుతి సుజుకి డిజైర్: మారుతి బ్రాండ్ నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి మారుతి డిజైర్(Maruti Dzire). త్వరలో ఈ కారుకు అప్‌డేట్ వెర్షన్ రానుంది. డిసెంబర్‌లో 14,012 డిజైర్ కార్లను విక్రయించగా, 2022 డిసెంబర్‌లో 11,997 కార్లు సేల్ అయ్యాయి. 17 శాతం వృద్ధిని సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
టాటా పంచ్: టాటా మోటార్స్ నుంచి మరో ప్రముఖ మోడల్ టాటా పంచ్(Tata Punch). లాంచ్ అయినప్పటి నుంచి కస్టమర్లలో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ కారు సేల్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. డిసెంబర్‌లో మొత్తం 13,787 కార్లను విక్రయించగా.. 2022 లో 10,586 టాటా పంచ్ ఎస్‌యూవీలను సంస్థ విక్రయించింది. దీంతో మొత్తంగా 30 శాతం వృద్ధిని సాధించింది.

మారుతి సుజుకి ఎర్టిగా: మారుతి సుజుకి నుంచి ప్రముఖ మోడల్ ఎర్టిగా(Maruti Suzuki Ertiga).. ఈ సారి నాల్గవ స్థానంలో నిలిచింది. ఫ్యామిలీ కారుగా ఎర్టిగా ప్రసిద్ధి చెందింది. గత డిసెంబర్‌లో మారుతి సంస్థ 12,975 ఎర్టిగా కార్లను విక్రయించింది. కాగా డిసెంబర్ 2022లో ఇది 12,273 కార్లను సేల్ చేయగా.. మొత్తంగా ఈ సారి విక్రయాలు 6 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.
మారుతి సుజుకి బ్రెజ్జా: మారుతి బ్రెజ్జా(Maruti Suzuki Brezza) కారు విడుదలైనప్పటి నుంచి క్రమంగా సేల్స్‌ను పెంచుకుంటూ కస్టమర్లలో మంచి గుర్తింపును సాధించింది. గత డిసెంబర్‌లో 12,844 కార్లు అమ్ముడుపోగా.. డిసెంబర్ 2022లో 11,200 బ్రెజ్జా కార్లను విక్రయించింది. దీంతో 15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్: మారుతి సుజుకి స్విఫ్ట్(Maruti Suzuki Swift) మంచి సేల్స్‌తో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. మారుతి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది కూడా ఒకటి. అయితే గత డిసెంబర్‌లో మొత్తం 11,843 కార్లను విక్రయించగా.. డిసెంబర్ 2022లో 12,061 కార్లు అమ్మడుయ్యయాయి. దీంతో సేల్స్ 2 శాతం క్షీణించింది. త్వరలోనే ఈ కారు అప్‌డేట్ లాంచ్ అవుతుండటంతో సేల్స్ తగ్గిపోయాయి.
మహీంద్రా స్కార్పియో: ఈ సారి టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక మహీంద్రా కారు స్కార్పియోనే(Mahindra Scorpio). ఈ కారు గత డిసెంబర్‌లో మొత్తం 11,355 కార్లను విక్రయించింది. డిసెంబర్ 2022లో కేవలం 7,003 కార్లు మాత్రమే అమ్ముడుపోగా.. 62 శాతం వృద్ధిని సాధించడం విశేషం. ఈ జాబితాలో అత్యధిక అమ్మకాల వృద్ధిని సాధించిన కారు మహీంద్రా స్కార్పియో.
మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno): టాప్ 10 జాబితాలో ఈ సారి కూడా మారుతి బాలెనో స్థానం దక్కించుకుంది. డిసెంబర్ 2023 లో 10,669 కార్లు మాత్రమే అమ్ముుడుపోగా.. గత డిసెంబర్ 2022లో 16,932 కార్లను విక్రయించింది. దీంతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు గణనీయంగా 37 శాతం తగ్గిపోయింది.

హ్యుందాయ్ వెన్యూ: టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక హ్యుందాయ్ కారు హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue). గత డిసెంబర్‌లో 10,383 వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. ఇది డిసెంబర్ 2022లో 8,285 విక్రయించగా.. ఇప్పుడు అమ్మకాలు 25 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కాగా దీని అప్‌డేట్ ఇటీవల విడుదలైంది.
మారుతి సుజుకి ఈకో: మారుతి సుజుకి యొక్క ఈకో మార్కెట్లో చాలా కాలంగా మంచి సేల్స్‌తో దూసుకుపోతోంది(Maruti Suzuki Eeco). 2023 డిసెంబర్‌లో 10,034 ఈకో కార్లు అమ్ముడుపోగా.. డిసెంబర్ 2022 అమ్మకాల సంఖ్య 10,581గా ఉంది. దీంతో 5 శాతం వృద్ధి క్షీణించింది.

చాలా కాలంగా ప్రతి నెలా మారుతి కార్లు ఎల్లప్పుడూ టాప్ 10 లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉండగా.. ఈ సారి మారుతి టాటా నెక్సాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆశ్చర్యకరం. ఈ కారు అప్‌డేటెడ్ వెర్షన్ గత నవంబర్‌లో విడుదలైంది. దీంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ కారు.. ఈ సారి గణనీయమైన సేల్స్‌ను సాధించింది.


Click it and Unblock the Notifications








