జూలైలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే.. టాప్ 10 కార్ల ఫుల్ సేల్స్ రిపోర్ట్ ఇదిగో!
దేశంలో కార్ల వినియోగం పెరుగుతోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ కలిగిన దేశంగా భారత్ ఎదుగుతోంది. జూలై 2024లో ప్రధాన వాహన తయారీ సంస్థలు విక్రయించిన కార్ల గణాంకాలను విడుదల చేశాయి. ఈ జాబితాలో మరోసారి హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ (Hyundai Creta SUV) తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మారుతి సుజుకి నుంచి 6 కార్లు, టాటా రెండు కార్లు, మహీంద్రా ఒక కారుతో టాప్ 10లో చోటు సంపాదించింది. ఆ సేల్స్ వివరాలు మీకోసం..
గత నెల జూలై 2024 హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. జూలైలో క్రెటా మొత్తం 17,350 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 జూలై నెలలో విక్రయించిన 14,062 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది హ్యుందా క్రెటా 23.38 శాతం వృద్ధిని సాధించింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల మధ్యలో ఉంది. ఈ ఎస్‌యూవీ గత కొన్ని నెలలుగా టాప్‌లో కొనసాగుతుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. జూలైలో 16,854 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. అయితే ఈ కారు 2023లో 17,896 యూనిట్లను సేల్ చేసింది. దీంతో దీని అమ్మకాలు 5.82 శాతం క్షీణించాయి.ఈ కారు ధర రూ .6.49 లక్షల నుండి రూ .9.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
ఆ తర్వాత మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ హ్యాచ్‌బ్యాక్ మూడవ స్థానంలో ఉంది. జూలైలో కంపెనీ 16,191 యూనిట్లను విక్రయించింది. ఈ కారు గత ఏడాది ఇదే నెలలో 12,970 యూనిట్లతో విక్రయించింది. ఇప్పుడు 24.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంది.

34.13 శాతం వృద్ధితో టాటా పంచ్ 16,121 ఫ్యూయల్, ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి నాలుగో స్థానంలో ఉంది. 2023 జూలైలో 12,019 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఫ్యూయల్ పవర్డ్ వేరియంట్ ధర రూ.6.13 లక్షల-రూ.10.20 లక్షలు.. ఎలక్ట్రిక్ వెర్షన్‌ల ధర రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు స్వల్పంగా పెరిగి 15,701 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల మధ్యలో ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఆప్షన్‌ని కూడా కలిగి ఉంది. ఇది లీటరుకు 20.3 నుంచి 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

మారుతి బ్రెజ్జా (మారుతి సుజుకి బ్రెజ్జా) 14,676 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానంలో ఉంది. ఈ కారు ధర రూ .8.34 లక్షల నుంచి రూ .14.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టాటా నెక్సాన్ (13,902 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (12,237 యూనిట్లు), మారుతి ఈకో (11,916 యూనిట్లు), మారుతి డిజైర్ (11,647 యూనిట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








