దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లు ఇవే.. టాప్ 10 కార్ సేల్స్
దేశంలో మే నెలలో విక్రయించిన సేల్స్ వివరాలను ప్రముఖ కంపెనీలు వెల్లడించాయి. భారతదేశంలోని ప్రజలు ఇష్టపడే కాంపాక్ట్ SUV విభాగంలో విక్రయించబడిన టాప్ 10 కార్ల అమ్మకాల డేటాను ఇక్కడ మేము తెలియజేయనున్నాము. ప్రస్తుతం విడుదల చేసిన డేటా ప్రకారం టాటా పంచ్ కారు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. అయితే గత నెలలో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కూడా టాప్ 10 జాబితాలో చేరింది. ఈ నెలలో వివిధ కంపెనీలు కార్లకు లభించిన సేల్స్ వివరాలు మీకోసం..
ఈ జాబితాలో నిస్సాన్ మ్యాగ్‌నైట్ పదో స్థానంలో ఉంది. గత మేలో మొత్తం 2,211 యూనిట్లను విక్రయించింది. ఇది మే 2023లో 26,18 కార్లు సేల్ అయ్యాయి. ఈ కారు విక్రయాలు 16 శాతం తగ్గాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా థార్ ఉంది. 2024 మే లో 5,750 కార్లు అమ్ముడవ్వగా.. మే 2023లో 4296 మాత్రమే సేల్ అయ్యాయి. ఈ ఏడాదిలో 34% విక్రయాలు పెరిగాయి.

ఎనిమిదో స్థానంలో ఉన్న కియా సోనెట్ గత మే లో 7,433 కార్లను విక్రయించింది. మే 2023లో 8,251 కార్లను సేల్ అయ్యాయి. దీని విక్రయాలు 10 శాతానికి తగ్గాయి. ఆ తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఉంది. గత మేలో 7697 కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు మే 2023లో విడుదల అయ్యింది. ఈ కారు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే మరియు కొనుగోలు చేసిన కార్లలో ఒకటిగా ఉండటం గమనార్హం.
హ్యుందాయ్ వెన్యూ కారు సేల్స్‌లో 6 స్థానంలో ఉంది. గత మే నెలలో 9,327 కార్లు అమ్ముడయ్యాయి. మే 2023లో మొత్తం 10,213 కార్లు సేల్ అయ్యాయి. దీని విక్రయాలు 9 శాతానికి తగ్గాయి. ఆ తర్వాత జాబితాలో మహీంద్రా XUV 3XO ఉంది. గత నెలలో ఈ కారు విడుదల అయ్యింది. ఒక్క నెలలో 10,000 కార్లను విక్రయించింది.

ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా రెండవ స్థానంలో ఉంది. గత మే నెలలోనే 14,186 కార్లు అమ్ముడయ్యాయి. మే 2023లో విక్రయించిన కార్లు 13,398 మాత్రమే. దీనిఅమ్మకాలు 6 శాతం పెరిగాయి. టాప్‌లో ఉన్న టాటా పంచ్ మే నెలలో 18,949 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరంలో మే 2023లో 11,124 యూనిట్లు విక్రయించబడింది. ఈ కారు విక్రయాలు 70 శాతానికి పెరిగాయి. టాటా నెక్సాన్, పంచ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.



Click it and Unblock the Notifications








