కారు చిన్నదైనా.. అస్సలు తగ్గని సేల్స్!.. వీటికోసం ఎగబడుతున్న జనం
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని కొత్త వాహనాలు దేశీయ విఫణిలో లాంచ్ అవుతున్నా.. జనం మాత్రం కొన్ని వాహనాలను కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల వాహన తయారీ సంస్థలు 2024 మే నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసాయి. ఇందులో మొత్తం ఎక్కువ అమ్ముడైన 10 కార్ల సేల్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కథనంలో ఎక్కువ అమ్ముడై నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్న కారు ఏది? చివరి స్థానం దక్కించుకున్న బైక్ ఏది అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..
విడుదలైన డేటా ప్రకారం 2024 మే నెలలో అత్యధిక అమ్మకాలు సొంతం చేసుకున్న బైక్ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన పంచ్ అని తెలుస్తోంది. ఈ మైక్రో SUV గత నెలలో 18948 యూనిట్లు అమ్ముడైంది. అంతకంటే ముందు 2023 మే నెలలో ఈ కారు సేల్స్ 11124 యూనిట్లు. చూస్తే వార్షిక అమ్మకాలు 2023 కంటే 2024లో 70 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.

టాప్ 10 కార్ల జాబితాలో టాటా పంచ్ మొదటి స్థానం సంపాదించగా.. మారుతి సుజుకి యొక్క బ్రెజ్జా రెండో స్థానంలో నిలిచింది. ఈ కారు అమ్మకాలు మే 2024లో 14186 యూనిట్లు కాగా.. మే 2023లో 13198 యూనిట్లు. వార్షిక అమ్మకాల పరంగా ఇది 2023 కంటే మే 2024లో 6 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది.
మూడో స్థానంలో సుజుకి ఫ్రాంక్స్, నాలుగో స్థానంలో టాటా నెక్సాన్ చేరాయి. ఇవి రెండూ మే 2024లో వరుసగా 12681 యూనిట్లు, 11457 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఈ కార్ల సేల్స్ మే 2023లో 9863 యూనిట్లు మరియు 14423 యూనిట్లని తెలుస్తోంది. వార్షిక వృద్ధిలో ఫ్రాంక్స్ 29 శాతం ఎక్కువ నమోచు చేయగా.. నెక్సాన్ మాత్రం -21 శాతానికి తగ్గింది.

ఐదు, ఆరవ స్థానాల్లో మహీంద్రా XUV 3ఎక్స్ఓ మరియు హ్యుందాయ్ వెన్యూ నిలిచాయి. ఈ కార్ల సేల్స్ మే 2024లో 10000 యూనిట్లు, 9327 యూనిట్లు. మే 2023లో ఈ కార్ల అమ్మకాలు వరుసగా 5125 మరియు 10213 యూనిట్లు అని తెలుస్తోంది. వార్షిక వృద్ధి వరుసగా 95 శాతం మరియు -9 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే వెన్యూ అమ్మకాలు మే 2023లో ఎక్కువని తెలుస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఏడో స్థానంలో, కియా సోనెట్ ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు మే 2024లో 7697 యూనిట్లు మరియు 7433 యూనిట్లు. మే 2023 అమ్మకాల విషయానికి వస్తే హ్యుందాయ్ ఎక్స్‌టర్ సేల్స్ 0గా ఉంది. ఎంధూకంటే కంపెనీ అప్పటికి వీటి సేల్స్ ప్రారంభించలేదు. కియా సోనెట్ సేల్స్ మాత్రం 8251 యూనిట్లుగా ఉంది. సోనెట్ వార్షిక వృద్ధి -10 శాతం కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

| Rank | Compact SUVs | May-24 | May-23 | Growth (%) |
| 1 | Tata Punch | 18,949 | 11,124 | 70 |
| 2 | Maruti Brezza | 14,186 | 13,398 | 6 |
| 3 | Maruti Fronx | 12,681 | 9,863 | 29 |
| 4 | Tata Nexon | 11,457 | 14,423 | -21 |
| 5 | Mahindra XUV 3XO | 10,000 | 5,125 | 95 |
| 6 | Hyundai Venue | 9,327 | 10,213 | -9 |
| 7 | Hyundai Exter | 7,697 | - | - |
| 8 | Kia Sonet | 7,433 | 8,251 | -10 |
| 9 | Mahindra Thar | 5,750 | 4,296 | 34 |
| 10 | Nissan Magnite | 2,211 | 2,618 | -16 |
ఇక చివరగా తొమ్మిది మరియు పదో స్థానాల్లో మహీంద్రా థార్ మరియు నిస్సాన్ కంపెనీ యొక్క మాగ్నైట్ ఉన్నాయి. వీటి సేల్స్ మే 2024లో 5750 యూనిట్లు మరియు 2211 యూనిట్లు. ఈ కార్ల అమ్మకాలు మే 2023లో వరుసగా 4296 మరియు 2618 యూనిట్లు. వార్షిక వృద్ధి పరంగా ఇవి రెండూ వరుసగా 34 శాతం మరియు -16 శాతంగా ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








