గత 7 నెలల్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే.. మొత్తం ఎన్ని లక్షల కార్లు కొన్నారో తెలుసా?
Top SUVs from April to October 2024 గత ఏడు నెలల్లో భారత్‌లో కార్ల అమ్మకాలు పెరిగాయి. వీటిలో ఎస్‌యూవీలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో మొత్తం 8,78,071 యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 7,54,533 యూనిట్లను విక్రయించింది. దీంతో ఎస్‌యూవీ కార్ల సేల్స్ 16 శాతం పెరిగాయి. ఇక మొత్తం ఎస్‌యూవీ అమ్మకాల పరంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2024 వరకు ఎస్‌యూవీలలో టాప్ నిలిచిన కార్ల అమ్మకాలను వివరాలపై ఓ లుక్కేయండి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO): టాప్ 10 ఎస్‌యూవీ అమ్మకాల్లో చోటు సంపాదించింది. ఇది ఏప్రిల్‌లో విడులైంది. కానీ మే నెలలో కొనుగోలుకి అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 3XO అమ్మకాలను కలిపి పరిశీలిస్తే.. మొత్తం 60,063 కార్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కేవలం 34,632 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కారు అమ్మకాలు 73 శాతం పెరిగాయి.

కియా సోనెట్ (Kia Sonet): ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం 64,716 యూనిట్ల సోనెట్ కార్ల అమ్మకాలతో 9వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ కేవలం 45,559 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాదితో పోల్చితే ఈ కారు అమ్మకాలు 42 శాతం పెరిగాయి.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue): అత్యధికంగా సేల్ అయిన ఎస్‌యూవీల జాబితాలో వెన్యూ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య మొత్తం 67,422 వెన్యూ యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సంవత్సరంలో కంపెనీ 76,956 యూనిట్లను విక్రయించింది. దీంతో ఈ కారు అమ్మకాలు 12 శాతం పడిపోయాయి.

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara): గ్రాండ్ విటారా ఈ జాబితాలో 7 వ స్థానంలో ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య మొత్తం 69,834 యూనిట్ల విటారా కార్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఈ కారుని 70,572 మంది కొనుగోలు చేశారు. దీంతో ఈ కారు అమ్మకాలు కేవలం ఒక శాతం మాత్రమే పడిపోయాయి.
టాటా నెక్సాన్ (Tata Nexon): ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 87,109 కార్లు అమ్ముడుపోగా.. గత ఏడాది ఈ సమయంలో 95,862 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 9 శాతం సేల్స్ పడిపోయాయి. ఆ తర్వాతి స్థానంలోని మారుతి ఫ్రాంక్స్ ఈ సంవత్సరం 90,750 కార్లు, గత ఏడాది 74,834 యూనిట్లతో 21 శాతం వృద్ధిని సాధించింది.

ఇక మహీంద్రా స్కార్పియో ఏప్రిల్-అక్టోబర్ మధ్య 96,920 యూనిట్లు.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 73,427 యూనిట్లను విక్రయించింది. ఇది 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక మారుతికి చెందిన బ్రెజా 1,10,227 కార్లతో 3 స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 97,978 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో సేల్స్ 12 శాతం పెరిగాయి.
ఇక రెండో స్థానంలోని హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 1,13,913 యూనిట్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 96,770 యూనిట్ల క్రెటాలను విక్రయించింది. ఈ టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ అమ్మకాలు 18 శాతం పెరిగాయి.
ఈ జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,17,560 యూనిట్ల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఈ నెలలో కంపెనీ కేవలం 87,943 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో కారు అమ్మకాలు 34 శాతం పెరిగాయి. ఓవరాల్‌గా టాటా పంచ్ నంబర్ 1 ఎస్‌యూవీగా నిలిచింది.


Click it and Unblock the Notifications








