మార్కెట్‌లో టాప్-10 కార్లు.. జనాలు వీటిని తప్పా వేరే కార్లను ముట్టుకుంటే ఒట్టు!
ఆగస్టులో కార్ల అమ్మకాలు కాస్త తగ్గినా ఎస్‌యూవీ కార్లు యధావిధిగా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా అందరూ ఎస్‌యూవీలను ఎంచుకుంటున్నారు. దీంతో వీటి సేల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో టాప్‌లో ఉండే హ్యాచ్‌బ్యాక్స్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాయి. ఈ చిన్న కార్ల కంటే జనాలు వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఈ కార్ల సేల్స్ పెరిగిపోతున్నాయి. గత నెలలో ఎన్ని ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. వీటిలో ప్రముఖ కంపెనీలకు చెందిన ఫేమస్ కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. గత ఆగస్టులో టాప్ 10లో నిలిచిన కార్లు ఇవే..
మారుతి సుజుకి బ్రెజా (Maruti Brezza) ఆగస్టు 2024 ఎస్‌యూవీ అమ్మకాలలో ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ కారు నెలవారీ అమ్మకాలలో దాని రికార్డును బద్దలు కొట్టింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆగస్టులో మొత్తం 19,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఆగస్టు 2023 లో విక్రయించిన 14,572 కార్ల కంటే చాలా ఎక్కువ. అంటే 32 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

ఆ తర్వాతి స్థానంలోని హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) 16,762 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉంది. 2023 ఆగస్టులో విక్రయించిన 13,832 కార్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక టాటా పంచ్ 15,643 యూనిట్లతో 8 శాతం వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఈ ఎస్‌యూవీ కేవలం 14,523 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి.
మహీంద్రా స్కార్పియో 13,787 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2023 ఆగస్టులో విక్రయించిన 9,898 కార్లతో పోలిస్తే ఇది 39 శాతం వృద్ధిని సాధించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 12,387 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 12,164 యూనిట్లతో పోల్చితే మూడు శాతం పెరిగింది.

టాటా నెక్సాన్ 12,289 యూనిట్ల అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2023 ఆగస్టులో విక్రయించిన 8,049 కార్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికంగా ఉంది. కియా సోనెట్ 10,073 దేశీయ అమ్మకాలతో 7వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 4,120 కార్లతో పోలిస్తే 144 శాతం వృద్ధి సాధించింది. వార్షిక అమ్మకాలతో టాప్-10 ఎస్‌యూవీలలో ఇదే అత్యధికం.
హ్యుందాయ్ వెన్యూ 9,085 యూనిట్ల అమ్మకాలతో 8వ స్థానంలో ఉంది. 2023 ఆగస్టులో విక్రయించిన 10,948 కార్లతో పోలిస్తే ఇది 17 శాతం క్షీణించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మహీంద్రా XUV 700 వరుసగా 9,021, 9,007 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి.

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో ఎస్‌యూవీల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజలు హ్యాచ్‌బ్యాక్, సెడాన్లకు బదులుగా ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతున్నారు. ఈ కార్లు సౌకర్యవంతంగా, క్లాసీ లుక్‌ని కలిగి ఉంటాయి. దీంతో ఈ సెగ్మెంట్లో భారీ స్థాయిలో పోటీ నెలకొంది. భవిష్యత్తులో ఈ సెగ్మెంట్ విపరీతంగా విస్తరిస్తుందని భావిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








