కార్లను విపరీతంగా కొంటున్న జనాలు.. ఆసక్తి రేపుతున్న జూన్‌ సేల్స్‌ రిపోర్ట్‌

ప్రస్తుతం దేశంలో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎక్కువగా ప్రజలు కార్లను కొనేందుకు మొగ్గు చూపడంతో ఇటీవలె కాలంలో ఊహించిన రీతిన సేల్స్‌ పెరుగుతున్నాయి. చిన్న కార్లు, ఇతర హ్యాచ్‌బ్యాక్‌ల కంటే జనాలు ఎక్కువగా ఎస్‌యూవీలను (SPort Utility Vehicles) ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ విభాగానికి చెందిన కార్లు ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయని కార్ల అమ్మకాల గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. భారతీయుల అభిరుచి రోజురోజుకూ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం భారత కార్ల అమ్మకాల మార్కెట్ దూసుకెళ్తుండగా 2024 జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 ఎస్‌యూవీల గణంకాలు విడుదలయ్యాయి. ఏ ఎస్‌యూవీ ఎక్కువగా అమ్ముడుపోయింది. ఏ ఎస్‌యూవీని అతి తక్కువ సమయంలో జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2024 జూన్ నెలలో విక్రయించిన కార్ల జాబితాలో టాటా మోటార్స్ పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌యూవీలే కాదు, హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్ల కంటే కూడా టాటా పంచ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎస్‌యూవీల జాబితాలో ఈ కారు అగ్రస్థానంలో నిలిచింది. అన్నిటికంటే ఎక్కువ సేల్స్‌తో టాటా పంచ్ జూన్‌ నెలలో అదరొగొట్టింది.

Tata-Punch-SUV-Sales-In-June-2024

టాటా పంచ్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ మోటారుతో కూడా లభిస్తుంది. తాజాగా ఈ టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కూడా అమ్మకాల్లో దూసుకుపోతుంది. మొత్తం మీద గత నెలలో టాటా పంచ్ 18,238 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూన్‌లో భారత్ లో మరే ఇతర కారు అమ్ముడుపోలేదు.

2023 జూన్‌లో కేవలం 10,990 పంచ్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టాటా పంచ్ అమ్మకాలు 65.95 శాతం పెరిగి 7,248 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా పంచ్ తర్వాత హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. గత నెలలో విక్రయించిన మొత్తం హ్యుందాయ్ క్రెటా కార్ల సంఖ్య 16,293గా ఉంది.

Hyundai-Creta-Sales-June-2024

జూన్ 2023 లో, హ్యుందాయ్ క్రెటా యొక్క 14,447 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే 12.78% తక్కువ. మారుతి సుజుకికి చెందిన బ్రెజ్జా 13,172 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది 24.52 శాతం అధికం. ఆ నెలలో కేవలం 10,578 బ్రెజ్జా కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

స్కార్పియో ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా కారుల్లో నాలుగో స్థానంలో ఉంది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ రెండు వేరియంట్లు ఉన్నాయి. మహీంద్రా జూన్ 2024 లో మొత్తం 12,307 స్కార్పియో యూనిట్లను విక్రయించింది. అయితే 2023 జూన్లో కేవలం 8,648 స్కార్పియో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Mahindra-Scorpio-N-Sales-Report-In-June

టాటా మోటార్స్‌కి చెందిన మరో పాపులర్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. గత నెలలో విక్రయించిన నెక్సాన్ కార్ల సంఖ్య 12,066. కానీ, 2023 జూన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదే నెలలో కంపెనీ 13,827 యూనిట్ల నెక్సాన్ ను విక్రయించింది. నెక్సాన్ అమ్మకాలు 12.74 శాతం క్షీణించాయి.

Rank SUV Sales June'24 June'23 Growth (%) YoY
1 Tata Punch / EV 18,238 10,990 65.95
2 Hyundai Creta 16,293 14,447 12.78
3 Maruti Brezza 13,172 10,578 24.52
4 Mahindra Scorpio / N 12,307 8,648 42.31
5 Tata Nexon / EV 12,066 13,827 -12.74
6 Hyundai Venue 9,890 11,606 -14.79
7 Kia Sonet 9,816 7,722 27.12
8 Maruti Fronx 9,688 7,991 21.24
9 Maruti Grand Vitara 9,679 10,486 -7.70
10 Mahindra XUV 3XO 8,500 5,094 66.86

హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ దాదాపు ఒకే రకమైన అమ్మకాల గణాంకాలతో టాప్ -10 జాబితాలో 6,7 స్థానాలను ఆక్రమించాయి. గత నెలలో ఈ కార్లు వరుసగా 9,890 మరియు 9,816 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 9,688 యూనిట్ల అమ్మకాలతో 8వ స్థానంలో ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (9,679), మహీంద్రా XUV 3XO (8,500) చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: టాటా పంచ్ వరుసగా నాలుగో నెల భారతదేశంలో నంబర్ వన్ కారుగా నిలిచింది. పంచ్ కార్ల అమ్మకాలు పెరగడం పట్ల టాటా మోటార్స్ సంతోషంగా ఉన్నప్పటికీ.. నెక్సాన్ కార్ల అమ్మకాలు తగ్గడం కొంచెం ఆశ్చర్యానికిి గురిచేస్తుంది. ఇక ఆఖర్లో ఉన్న మహీంద్రా XUV 3XO వేగంగా అమ్ముడైన కారుగా ఉంది. దీని సేల్స్‌ గణనీయంగా పెరుగుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, July 11, 2024, 9:54 [IST]
English summary
Top 10 suvs sold in june 2024 tata punch to mahindra xuv 3xo full sales report in telugu
Read more on: #car sales #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+