దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 15 కార్లు ఇవే.. వీటి కోసం షోరూమ్‌ల వద్ద పడిగాపులు!

దేశంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. హ్యాచ్‌బ్యాక్స్, భారీ ఎంపీవీల కంటే జనాలు వీటిని కొనేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు సైతం భారతీయ మార్కెట్‌లో భారీ సంఖ్యలో ఎస్‌యూవీలను విడుదల చేస్తున్నాయి. ఎస్‌యూవీలలో ఎక్కువగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు, మైక్రో ఎస్‌యూవీలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీ నెలలోనూ ఈ ఎస్‌యూవీలు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 ఎస్‌యూవీల జాబితా, నంబర్‌ ఆఫ్‌ యూనిట్‌ సేల్స్ లాభ నష్టాలకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

గత సెప్టెంబర్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ 6,198 యూనిట్ల సేల్స్‌తో 15వ స్థానంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 8,647 యూనిట్స్‌ సేల్స్‌తో పోల్చితే ఈ కారు అమ్మకాలు 20 శాతం తగ్గాయి. 6,959 యూనిట్లతో కియా సెల్టోస్ 14వ స్థానంలో ఉంది. 2023 సెప్టెంబర్‌లో 10,558 యూనిట్లను విక్రయించగా.. దీని అమ్మకాలు 34 శాతం వరకు పడిపోయాయి.

Kia Seltos September Sales 2024

మహీంద్రా బొలెరో ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంది. గత నెలలో 8,150 యూనిట్లను విక్రయించగా.. 2023 సెప్టెంబర్లో 9,519 కార్లను విక్రయించింది. దీని అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ఇక మహీంద్రా థార్‌ 12వ స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో ఈ కారు 8,843 యూనిట్లు విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో కేవలం 5,417 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని అమ్మకాలు 63 శాతం పెరిగాయి.

ఆ తర్వాత మహీంద్రా ఎస్‌యూవీ 3XO ఈ జాబితాలో 11వ స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో 9,000 యూనిట్లు అమ్ముడుపోగా.. 2023 సెప్టెంబర్‌లో కేవలం 4961 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కారు అమ్మకాలు 81 శాతం పెరిగాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంటుంది. 2023 సెప్టెంబర్‌లో 8,555 కార్లు అమ్ముడవగా.. ఈ సెప్టెంబర్‌లో 9,646 అమ్మకాలతో సేల్స్‌ 13 శాతం పెరిగాయి.

Mahindra XUV 700 SUV Sales

ఆ తర్వాత హ్యుందాయ్ వెన్యూ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 10,259 యూనిట్లు అమ్ముడవగా.. 2023 సెప్టెంబర్‌లో 12,204 కార్లు అమ్ముడయ్యాయి. దీని అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. ఆ తర్వాత మారుతి గ్రాండ్ విటారా ఉంది. సెప్టెంబర్‌లో 10,267 యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో 11,736 కార్లను విక్రయించడం ద్వారా కారు అమ్మకాలు 13 శాతం పడిపోయాయి.

ఈ జాబితాలో కియాకు చెందిన సోనెట్ ఏడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 10,335 యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో కేవలం 4984 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కారు అమ్మకాలు 107 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఆరో స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. 2018 సెప్టెంబర్‌లో 11,470 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్ 203లో కంపెనీ 15,325 యూనిట్లను విక్రయించింది. దీని అమ్మకాలు 25 శాతం పడిపోయాయి.

Tata Nexon Sales in September 2024

ఈ జాబితాలో ఐదవ స్థానంలో టాటా పంచ్ కారు ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 13,711 కార్లు అమ్ముడవ్వగా.. 2023 సెప్టెంబర్‌లో 13,036 కార్లు విక్రయించాయి. ఈ కారు అమ్మకాలు 5% పెరిగాయి. ఇక మారుతికి చెందిన ఫ్రాంక్స్ నాలుగో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 13,874 కార్లు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌లో కేవలం 11,455 కార్లు అమ్ముడై సేల్స్‌ 21 శాతం పెరిగాయి.

మహీంద్రాకు చెందిన స్కార్పియో మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 16,388 కార్లు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌లో 11,849 కార్లను విక్రయించింది. కారు అమ్మకాలు 22 శాతం పెరిగాయి. ఇక మారుతికి చెందిన బ్రెజా రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 15,322 కార్లు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌లో 15,001 కార్లను విక్రయించింది. ఈ కారు అమ్మకాలు 2 శాతం పెరిగాయి.

Hyundai Creta September 2024

హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2018 సెప్టెంబర్‌లో కంపెనీ 15,902 యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో కేవలం 12,717 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కారు అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఈ నెలలో ఈ ఎస్‌యూవీల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2024, 16:57 [IST]
English summary
Top 15 suv sales in september 2024 check full sales report in telugu
Read more on: #auto news #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+