జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీలపైనే వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇందులో హ్యుందాయ్, మారుతి, కియాలకు చెందిన కార్లు మాత్రమే అమ్మకాల్లో రాణిస్తున్నాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీలను గమనిస్తే ఈ కంపెనీ కార్లు మాత్రమే సత్తా చాటాయి.
ఎస్‌యూవీలు వివిధ కేటగిరీలుగా విభంజించబడ్డాయి. అందులో ప్రధానమైనది కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీల పొడవు 4 మీటర్లకు పైగా ఉంటుంది. ఈ కేటగిరీలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా ఉంది. ఆ తర్వాత మారుతి విటారా గ్రాండ్ (Grand Vitara), కియా సెల్టోస్(Kia Seltos)లు నిలిచాయి. జనాలు ఎక్కువగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరం సేల్స్: ఈ ఆర్థిక సంవత్సరంలో కాంపాక్ట్ కార్లు అమ్మకాల్లో రాణించాయి. ఈ విభాగంలో మొత్తం అమ్మకాల్లో హ్యుందాయ్ సంస్థ 1,62,773 క్రెటా యూనిట్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు చొప్పున చూసుకుంటే మొత్తం 13,564 క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. మార్చి 2024 లో క్రెటా 16,458 యూనిట్లను సేల్ చేసింది. అంటే గత ఏడాదిలో అదే అత్యధికం.
క్రెటా కార్లలో అత్యల్పంగా గత ఏడాది డిసెంబర్ లో 9,243 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రెటా తర్వాత మారుతి సుజుకి నుంచి గ్రాండ్ విటారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. దీనిని కంపెనీ ఇటీవలె అత్యాధునిక ఫీచర్లతో తీసుకువచ్చింది. మారుతికి ఉన్న మార్కెటింగ్ నెట్‌వర్క్ ద్వారా మంచి సేల్స్‌ని సాధించింది. అయితే క్రెటాని మాత్రం ఢీ కొట్టలేకపోయింది.

మారుతి సుజుకి గత ఏడాది కాలంలో మొత్తం 1,21,169 గ్రాండ్ విటారా కార్లను విక్రయించింది. నెలకు సగటున 10,097 గ్రాండ్ విటారా కార్లు సేల్ చేయబడ్డాయి. మారుతి సుజుకి 2024 జనవరిలో 13,438 గ్రాండ్ విటారా కార్లను విక్రయించింది. ఇదే అత్యధికం. మారుతి సుజుకి గత ఏడాది డిసెంబర్లో 6,988 గ్రాండ్ విటారా యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ టెక్నాలజీతో విక్రయించబడుతుంది మరియు ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తిని కలిగి ఉంటుంది.
ఈ రెండు కార్ల తర్వాత కియా సెల్టోస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సేల్స్‌లో మూడవ స్థానంలో ఉంది. హ్యుందాయ్ క్రెటా మాదిరిగానే కొరియన్ స్టైల్ ఎస్ యూవీ సెల్టోస్ కూడా గత ఏడాదిలో 1,00,423 యూనిట్లను విక్రయించింది. నెలకు 8,369 యూనిట్ల చొప్పున ఈ కార్లు అమ్ముడయ్యాయి. గత 6 నెలల్లో ఈ కారు సేల్స్ గణనీయంగా మెరుగుపడ్డాయి. దీని వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు మూడు నెలల కంటే ఎక్కువే పైబడి ఉంది.

ఈ మూడు మోడళ్లతో పాటు టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగన్ మరియు ఎంజి ఆస్టర్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు కూడా భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 50,000 కూడా దాటలేదు. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్‌లో భారీ సేల్స్ పెంచుకునేందుకు ఈ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








