కొత్త ఏడాదిలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా..! అయితే కియా అప్‌కమింగ్ కార్లను ఓసారి చూసేయండి..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈవీ కార్ల వైపు చూస్తున్నారు. గతంలో ఈవీ మార్కెట్ తక్కువగా ఉండగా, ఇటీవల కాలంలో వీటి వాడకం ఎక్కువగా పెరిగింది. 2024 ఏడాదిలో వాహన తయారీదారులు లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు కలిగిన కార్లను లాంచ్ చేశారు. దేశీయ కంపెనీలే కాకుండా, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన వాహన తయారీ సంస్థలు వరుసగా కొత్త కొత్త మోడళ్లను పోటీ పడుతూ మరి విడుదల చేశాయి. 2023 ఏడాదితో పోలిస్తే 2024 ఏడాది ఈవీ కంపెనీలకు మెరుగైన లాభాలను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా బ్రాండ్‌కు చెందిన కియా మోటార్స్ చాలా కాలంగా దేశంలో కార్యకలాపాలను సాగిస్తుందని అందరికి తెలిసిందే. కియా ఇండియా పేరుతో ఇక్కడి మార్కెట్లో వేగంగా పెద్ద మార్కెట్ వాటాను సంపాదించుకుంది.
కియా ఇండియాకు చెందిన చాలా కార్లు ప్రస్తుతం అన్ని నగరాల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పట్టణాలు, గ్రామీణ మార్కెట్ వాటాపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఈ ప్రాంతాల్లో అమ్మకాలను పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరగడాన్ని గుర్తించిన కియా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసి ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చి ఇతర కంపెనీల కంటే అగ్రస్థానంలో ఉండాలని చూస్తుంది.

ఈ నేపథ్యంలో 2025లో కొత్తగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చి రాబోయే ఏడాదిలో ఈవీ మార్కెట్లో తన సత్తాను చాటాలని భావిస్తుంది. దీనికోసం ఈ సెగ్మెంట్‌లో మూడు కొత్త ఈవీ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. కియా కేరెన్స్ ఈవీ (kia carens ev), కియా ఈవీ6 (kia ev6), కియా సోనెట్ ఈవీ (Kia sonet ev) కార్లు కొత్త ఏడాదిలో భారత మార్కెట్లో సందడి చేయబోతున్నాయి.
kia carens ev: కియా కేరెన్స్ ఈవీ 2025 ఏడాదిలో మార్కెట్లోకి లాంచ్ అవుతుంది. అంచనాల ప్రకారం దీని ప్రారంభ ధర రూ.20 లక్షల నుంచి ఉంటుంది. టాప్ వేరియంట్ మరింత ఎక్కువ ధరకు లభించవచ్చు. ఈ కారులో శక్తివంతమైన బ్యాటరీని అందించారని తెలుస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో కారు దాదాపు 450 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని అంచనా. ఈ కారు డిజైన్ చూసినట్లయితే చాలా స్టైలిష్‌గా ఉంది.

kia ev6: కియా కంపెనీ వచ్చే ఏడాదిలో అప్‌డేటెడ్ ఈవీ6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతుంది. పాత మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పులను కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్‌ను కొత్తగా ఇచ్చారు. అంచనాల ప్రకారం ఇది సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 490 కి.మీలకు పైగా ప్రయాణిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా దీనిలో ఫాస్ట్ ఛార్జర్ సదుపాయాన్ని ఇచ్చారు. క్యాబిన్ అందంగా ఉంటుంది. లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లను లోపల అందించారు.
Kia sonet ev: కియా సోనెట్ ఈవీ ప్రధానంగా తక్కువ ధరలో లభించేచ అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం దీని ధర రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద కొనుగోలుకు లభించవచ్చు. ఈవీ కార్ కావాలనుకునే మధ్యతరగతి ప్రజల కోరికను ఇది తీర్చడానికి వస్తుంది. బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 400 నుంచి 450 కి.మీల వరకు ప్రయాణిస్తుందని సమాచారం.
కియా సోనెట్ ఈవీ డిజైన్ టాటా, మహీంద్రా కార్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారును గతంలో రోడ్లపై టెస్ట్ చేశారు. ఈ సమయంలో ఫోటోలు క్లిక్ కాగా అవి ఆన్‌లైన్‌లో తెగ షేర్ అయ్యాయి. దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే లోపల కూడా అధునాతన ఫీచర్లను అందించారు.


Click it and Unblock the Notifications








