మంచి ఎలక్ట్రిక్‌ కారు కొనాలని చూస్తున్నారా? ఇదిగో టాప్‌-5 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఎక్కువ పట్టణ ప్రాంత ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. కాలుష్య రహిత వాహనం కావడం, ఎక్కువ ప్రయోజనాలు తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో జనాలు ఎలక్ట్రిక్‌ వాహనానలకు జై కొడుతున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తుడంటంతో ప్రజల్లో సైతం అవగాహన పెరిగింది. తాజాగా వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఎక్కువ రేంజ్‌తో పాటు స్మార్ట్‌ ఫీచర్లతో కార్లు, బైక్‌లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్‌ స్టేషన్లు వేగంగా నెలకొల్పుతున్నాయి. దీంతో పట్టణ వాసులు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు.

Most Affordable-Electric-Cars

సాంప్రదాయ కార్లకంటే ఎలక్ట్రిక్‌ కార్ల వైపు జనం చూస్తున్నారు. దూర ప్రయాణాల కోసం మంచి రేంజ్‌ అందించే కార్ల కోసం అన్వేషిస్తున్నారు. అందరికి అందుబాటు ధరలో కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కూడా పెట్రోల్‌, డీజీల్‌ కార్లకు సరి సమానంగా ఉన్నాయి. హై రేంజ్‌తో పాటు మంచి ఫీచర్లతో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఐదు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల జాబితా మీకోసం..

ఎంజీ కామెట్‌ ఈవీ: ఈ పొట్టి కారు పట్టణ వాసులకు ది బెస్ట్ ఛాయిస్‌ అని చెప్పవచ్చు.ఈ కారులోని 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ని 3.3kW AC కరెంట్‌ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. ఇది 42PS శక్తిని మరియు 110Nm టార్క్‌ను అందిస్తుంది. ఫుల్‌ ఛార్జ్‌తో 230కిమీల రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.40 లక్షల మధ్య ఉంది.

MG-Comet-EV

Tata Tiago EV: ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుంది. 19.2kWh ఎలక్ట్రిక్ మోటార్‌ యూనిట్‌ 61PS శక్తిని 110Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. 24kWh ఎలక్ట్రిక్ మోటార్‌ 75PS శక్తిని మరియు 114Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫుల్‌ ఛార్జ్‌పై ఈ ఈవీ 250 నుంచి 315 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ.7.9 లక్షల నుంచి 11.89 లక్షలుగా ఉంది.

సిట్రోయిన్‌ eC3: ఈ కారులోని 29.2 kWh బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 320 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో కి.మీ కు 0.91 పైసలు ఖర్చు అవుతుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 56 bhp వద్ద 143 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 11.61 లక్షల నుంచి 13.35 లక్షల మధ్య ఉంది.

Citrroen-Ec3

టాటా టిగోర్‌ ఈవీ: Tigor EV 26 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ (75 PS శక్తి మరియు 170 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 315 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారు ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉంది.

టాటా పంచ్‌ ఈవీ: ఎలక్ట్రిక్‌ కార్లలో ఈ కారు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కారు ఇది 35 kWh బ్యాటరీ సామర్థ్యంలో ఫుల్‌ ఛార్జ్‌పై 421 km రేంజ్‌ను అందిస్తుంది. 25 kWh బ్యాటరీ ప్యాక్‌ 315 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. 69kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ 114nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల మధ్య ఉంది.

Tata-Punch EV

పైన తెలిపిన ఎలక్ట్రిక్‌ కార్లల్లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్లు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో టాప్‌లో ఉన్నాయి. సాంప్రదాయ కార్లు కాకుండా ఎలక్ట్రిక్‌ కార్ల వైపు చూసే వారు పైన తెలిపిన కార్లను కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం దగ్గర్లోని షోరూమ్‌ లేదా అధికారికి వెబ్‌సైట్‌లో సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, May 23, 2024, 11:35 [IST]
English summary
Top 5 affordable electric suvs in india starting from 6 99 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+