కాల్‌ ట్యాక్సీ సర్వీస్‌లో మంచి లాభాలు పొందాలంటే.. ది బెస్ట్‌ కార్లు ఇవే.. వీటిని ఢీకొట్టేదే లేదు.!!

దేశంలో కాల్‌ ట్యాక్సీ సర్వీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం కుదరని వారికి ఇది బెస్ట్‌ ఛాన్స్‌. ఓ మంచి కారు కొనుక్కొని క్యాబ్‌ సర్వీస్‌లో పెట్టారంటే ఏ చీకూ చింతా లేకుండా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అయితే ఈ సెగ్మెంట్‌లో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఈ రంగంలో రాణించాలంటే మంచి పర్ఫామెన్స్‌ అందించే కారును కొనుగోలు చేయడం చాలా అవసరం.

మరి కొనుగోలు చేసే కారు మోడల్‌(Call Taxi Service Best Cars) ద్వారా మీరు.. ఇందులో ఎక్కువ లాభాలు, అధిక బుకింగ్‌లను పొందవచ్చు. అంటే, కాల్ టాక్సీ సెగ్మెంట్లో ఉపయోగించడానికి అనువైన టాప్ 5 కార్ మోడల్స్ ఏవి? మరియు వాటి ధరలు ఏంటి.?? పూర్తి వివరాలు ఈ కథనంలో..

Hyundai-Aura

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura): భారత్‌లోని కాల్ టాక్సీ సర్వీస్ సెగ్మెంట్‌లో ఉపయోగించడానికి అనువైన సెడాన్ రకం కార్ మోడల్ హ్యుందాయ్‌ ఆరా. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ మోడల్‌లలో ఆరా కూడా ఒకటిగా ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ. 6.33 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్‌ ధర మాత్రమే.

హ్యుందాయ్‌ ఆరా గరిష్ఠంగా 22.42 కి.మీ నుంచి 23.56 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు మోడల్ వినియోగదారులకు ప్రీమియం రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అందుకే కస్టమర్లు కొందరు ఈ కారు కోసం వెతికి మరీ బుక్ చేసుకుంటారు.

Maruti-Ciaz

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz): కాల్‌ టాక్సీ సర్వీస్‌ సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌ ఆరా తర్వాత అత్యధిక డిమాండ్‌ ఉన్న మోడల్‌ మారుతి సుజుకి సియాజ్‌. ఈ కారులో కూడా ప్రయాణికులు ప్రీమియం జర్నీ అనుభూతిని పొందవచ్చు. అందుకే కొన్ని స్టార్ ప్రైవేట్ హోటళ్లు సైతం తమ అతిథులను తీసుకెళ్లేందుకు ఈ కార్ మోడల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి.

అంతేకాకుండా మారుతి సియాజ్‌ భారతదేశంలోని కొంతమంది ముఖ్యమైన ప్రభుత్వ అధికారులకు అధికారికంగా వాహనంగా కూడా కేటాయించారు. ఇటువంటి కారు మోడల్‌ను కాల్ టాక్సీ సర్వీస్‌లో ఉపయోగించినట్లయితే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల వరకు ఉంది. లీటర్‌కు 20.04 కి.మీ నుంచి 20.65 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది.

Maruti-Dzire

మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire): దేశంలో కాల్ టాక్సీ సెగ్మెంట్‌లో ప్రయాణికులు ఎక్కువగా ఇష్టపడే కార్ మోడల్ మారుతి సుజుకి డిజైర్. ఈ కారులో డ్రైవర్‌తో పాటు ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. తగినంత బూట్‌ స్పేస్‌ ఉంది. ప్యాకేజీ కింద కస్టమర్లను సుదీర్ఘ ప్రయాణాలకు తీసుకెళ్లడానికి అనువైన కారు మోడల్‌గా కూడా డిజైర్‌ నిలుస్తుంది.

మారుతి డిజైర్‌ సెడాన్ గరిష్ఠంగా 22.41 kmpl నుంచి 22.61 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర రూ. ఇది 6.51 లక్షల ప్రారంభమవుతుంది. దీని సరసమైన ధర మరియు అధిక మైలేజ్‌ కారణంగా కాల్ టాక్సీ సర్వీస్‌లో మంచి లాభాలను ఆర్జించడానికి మీకు దోహదపడుతుంది. అందుకే ఈ కారు మోడల్‌.. అనేక కాల్ టాక్సీ డ్రైవర్లకు ఫస్ట్‌ ఛాయిస్‌.

Maruti-Ertiga

మారుతీ సుజుకి ఎర్టిగా(Maruti Suzuki Ertiga): మారుతి సుజుకి ఎర్టిగా 7 సీటర్ ఎంపీవీ రకం కారు మోడల్‌. ఈ కారులో ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం ఉండటంతో.. కాల్ టాక్సీ సర్వీస్ సెగ్మెంట్‌లో ఎర్టిగా ప్రముఖ కార్ మోడల్‌గా ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు చాలా మంది ఈ కారునే సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఈ కారు నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ.

మార్కెట్లో ఎర్టిగా కారు రూ. ఇది రూ. 8.69 లక్షల ప్రారంభ ధర నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 20 కి.మీ - 21 కి.మీ మైలేజీని అందిస్తుంది. అందుకే ఈ కారుకు కాల్ టాక్సీ మరియు రెంటల్ కార్ సర్వీస్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

Toyota-Innova-Crysta

టయోటా ఇన్నోవా క్రిస్టా MPV(Toyota Innova Crysta MPV): కుటుంబ సమేతంగా కలిసి విలాసవంతంగా ప్రయాణించేందుకు అత్యుత్తమ ప్రయాణ కారు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎంపీవీ. అందుకే చాలా మంది భారతీయులు ఈ కారును ఫేవరెట్ కార్ మోడల్‌గా భావిస్తారు. ఈ సెగ్మెంట్లో ఈ కారుకు డిమాండ్ ఎక్కువే.

అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ కారును వినియోగిస్తున్నారు. అదేవిధంగా కాల్ టాక్సీ సర్వీస్ సెగ్మెంట్లో కూడా ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ. 19.99 లక్షల నుంచి ఉంది. ఇది 15.60 kmpl కంటే తక్కువ మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2024, 9:46 [IST]
English summary
Top 5 best cars for call taxi service in india as per mileage and price check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+