ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన ఇండియా బెస్ట్ కార్స్.. ఆఖరులో వచ్చి దుమ్మురేపుతున్నాయి..
ప్రస్తుతం 2024 ఏడాది ముగింపుకు దగ్గరగా ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో ఆటోమొబైల్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. భారతీయ ప్రజలు క్రమంగా కార్లను కొనుగోలు చేయడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిఏటా ఈ పరిశ్రమ వృద్ధి వేగంగా పెరుగుతుంది. ప్రధానంగా ప్రపంచదేశాల్లో లేని సానుకూలతలు భారత్‌లో ఉండటం కారణంగా ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలుకుని డిసెంబర్ వరకు అధునాతన ఫీచర్లతో కూడిన సరికొత్త కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరొందిన కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేసి సక్సెస్ అయ్యాయి. హ్యాచ్‌బ్యాకుల నుంచి మొదలుకుని ఎస్‌యూవీలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు 2024 ఏడాదిలో సందడి చేశాయి. అమ్మకాల పరంగా కూడా దాదాపు కార్లు విజయవంతమయ్యాయి. ఆ కార్లు ఏవో క్రింది కథనంలో తెలుసుకుందాం..
Honda Amaze: హోండా అమేజ్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారు. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.10.90 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. దీని డిజైన్ సరికొత్తగా ఉంటుంది. ఇది సెడాన్ మోడల్. అమేజ్ 1.2-లీటర్ న్యేచురల్ అస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నతో రన్ అవుతుది. సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటివి ఉన్నాయి.

Mahindra Thar Roxx: దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రా నుంచి 5 డోర్ థార్ రాక్స్ 14 ఆగస్టు 2024న మార్కెట్లోకి విడుదల అయింది. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. గతంలో తీసుకొచ్చిన 3 డోర్ థార్ ఇండియాలో మంచి డిమాండ్ సాధించడంతో కంపెనీ దీనికి కొనసాగింపుగా రాక్స్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.12.99 లక్షల నుంచి ఉంటుంది.
అదే టాప్ వేరియంట్ ధర రూ.22.49 లక్షల(ఎక్స్ షోరూమ్) ధర వరకు ఉంటుంది. ఇది 2 లీటర్ పెట్రోల్, 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లలో లభిస్తుంది. థార్ కంటే రాక్స్ మోడల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎంటర్‌టైన్ మెంట్ కోసం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంను ప్రత్యేకంగా అందించారు.

Maruti Suzuki Dzire 2024: మారుతీ సుజుకీ ఇండియాలో ఆటోమొబైల్ రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉంది. 2024 ఏడాదిలో కొత్త డిజైర్‌ను తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత అప్‌డేట్‌గా ఉంటుంది. ఈ సెడాన్ బేస్ వేరియంట్ ధర రూ. 6.79 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.10.14 లక్షల మధ్య ఉంటుంది. బడ్జెట్ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువగా ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నారు.
Skoda Kylaq: స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ ఏడాదిలో మార్కెట్లోకి వచ్చింది. ఇది రూ. 7.89 లక్షల నుంచి మొదలుకుని రూ.14.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు ఉంటుంది. ఇది 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. కారు డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

Tata curvv: ప్రయాణికుల సేఫ్టీ పరంగా టాటా మోటార్స్ ప్రముఖ కంపెనీగా ఉంది. ఈ ఏడాదిలో టాటా కొత్త కర్వ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇది ఐసీఈ, ఎలక్ట్రిక్‌లో ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఐసీఈ కర్వ్ బేస్ ధర రూ.9.99 లక్షలు, టాప్ మోడల్ రూ. 17.69 లక్షల మధ్య ఉంది. ఈవీ బేస్ ధర రూ.17.49 లక్షలు, టాప్ మోడల్ రూ.21.99 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.


Click it and Unblock the Notifications








