మార్కెట్‌లో లభించే టాప్‌-5 ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. ధరకు తగినట్లుగా రేంజ్‌, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఊపందుకుంది. గతంలో కంటే జనాలు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లపై వస్తున్న నెగిటీవ్‌ రెస్పాన్స్‌ని తుంగలో తొక్కుతూ గత మూడు సంవత్సరాలుగా సేల్స్‌లో ఎలక్ట్రిక్‌ కార్లు దూసుకుపోతున్నాయి. కార్లను కొనుగోలు చేసే ప్రతీ 5 మందిలో ఇద్దరూ ఈవీ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ఈవీ కార్స్‌ అండ్‌ రీసెర్చ్‌పై ఓ సంస్థ నిర్వహించిన సర్వే తెలిపింది. క్రమంగా వీటి కొనుగోళ్లు కూడా పెరుగుతున్నట్లు ఆ సర్వే తెలిపింది. ప్రధాన వాహన తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్లలో ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను అందిస్తున్నాయి. దీంతో జనాలు వీటినే కొనేందుకు ఓటేస్తున్నారు.

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దేశంలో టాటా మోటార్స్‌ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం రెండు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లు లేదా ఎస్‌యూవీలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ .20 లక్షల లోపు కొనుగోలు చేయడానికి పాప్‌లర్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాటా కార్లు 3 ఉన్నాయి. మార్కెట్‌లో ఇక్కడ మేము చెప్పబోయే ఈవీలకు భారీ డిమాండ్‌ ఉంది.

Top 5 Electric cars Under 20 lakhs

ప్రస్తుతం మార్కెట్‌లో టాప్‌ 5 ఈవీ కార్లను ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV), పంచ్ ఈవీ (Punch EV), నెక్సాన్ ఈవీ (Nexon EV), ఎంజీ జెడ్ ఈవీ (MG ZS EV), మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400 EV) ఈవీలు ఉన్నాయి. వాటి ధరలు, ఫీచర్లు ఇతర స్పెసిఫికేషన్స్‌ మీ కోసం..

టాటా కర్వ్ ఈవీ: ఇటీవల దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ కారు ఆకర్షణీయమైన ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది 45 kWh 55 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 502 కిలోమీటర్ల నుంచి 585 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ .17.49 లక్షల నుంచి రూ .21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

Top Electric Car Tata Curvv EV

ఈ కర్వ్‌ ఈవీలో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇందులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్‌, లెవల్ -2 ADAS (అడ్వాన్స్డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

టాటా నెక్సాన్‌: ఈ ఈవీ 30kWh, 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 325 కి.మీ నుంచి 465 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇందులో 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .14.49 లక్షల- రూ .19.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది.

Tata Nexon Top Electric Car

టాటా పంచ్ ఈవీ: ఈ కారు 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 315 నుంచి 421 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లై వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్యలో ఉంది.

ఎంజీ జెడ్ఎస్‌ ఈవీ: ఇది 50.3 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై లీటరుకు 461 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులో 10.1 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.18.98 లక్షల నుంచి రూ.25.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

Tata Punch Top Electric Car

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ: ఇది 34.5 kWh, 39.4 kWh బ్యాటరీ ఆప్షన్‌ని కలిగి ఉంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 375 నుంచి 456 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌తో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.15.49 లక్షల నుంచి రూ.19.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2024, 9:56 [IST]
English summary
Top 5 electric cars under 20 lakhs check price range and specifications details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+