టాప్ 5 బెస్ట్ సెవెన్ సీటర్ కార్లు.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్ - ధర కూడా తక్కువే!

భారతదేశంలో ప్రతి ఒక్కరూ కారు ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే సొంతంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో కేవలం మైక్రో కార్లకు మాత్రమే కాకుండా మిడ్ సైజ్ మరియు ఫుల్ సైజ్ SUVలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. చిన్న కుటుంబాలు మైక్రో SUVలు లేదా హ్యాచ్ బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తుంటే.. పెద్ద కుటుంబాలు 7 సీటర్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ కథనంలో దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న సరసమైన 7 సీటర్ కార్లు ఏవి? వీటి ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

మహీంద్రా బొలెరో నియో

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క 'నియో' రూ.9.95 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే సరసమైన 7-సీటర్ కారు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకూండా అత్యద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ SUV 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 98 Bhp పవర్ మరియు 260 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Mahindra Bolero Neo

మహీంద్రా బొలెరో

భారతీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి అధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా యొక్క బొలెరో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు సరసరమైన 7 సీటర్. దీని ధర రూ. 9.98 లక్షలు. ఈ SUV 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ యొక్క సీ3 ఎయిర్‌క్రాస్ కూడా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన 7 సీటర్ మోడల్. దీని ధర రూ.11.96 లక్షలు. ఈ కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 108 Bhp పవర్ మరియు 206 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Citroen C3 Aircross

మహీంద్రా స్కార్పియో క్లాసిక్

రూ. 13.59 లక్షల ధర వద్ద లభించే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారు మన జాబితాలో చెప్పుకోదగిన 7 సీటర్ మోడల్. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ సెకండ్ జనరేషన్ మోడల్ మరియు మూడవ జనరేషన్ మోడల్ స్కార్పియో ఎన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్

మహీంద్రా స్కార్పియో యొక్క 'ఎన్' మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ఉత్తమ మోడల్. దీని ధర రూ.13.85 లక్షలు. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగి మెరుగైన పవర్‌ట్రెయిన్‌లను పొందుతుంది. ఇందులోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 173 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 200 Bhp పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Mahindra Scorpio N

నిజానికి 7 సీటర్ విభాగంలో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి.. ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి. అయితే ఎక్కువ మంది సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపుతారు కాబట్టి.. పైన వెల్లడించిన కార్లు అలాంటి వారికి ఉత్తమ ఎంపిక అవుతాయని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2024, 17:01 [IST]
English summary
Top 5 most affordable 7 seater suvs in india
Read more on: #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+