నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్‌ 5 కార్లు ఇవే.. మళ్లీ అమ్మకాల్లో నంబర్‌ 1కి భల్లే భల్లే కారు!

దేశంలో గత కొన్ని నెలలుగా హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా నవంబర్‌లో బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో మరోసారి తొలి స్థానంలో నిలిచింది. మార్కెట్‌లో ఎస్‌యూవీ, ఎంపీవీలకు భారీ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు తగ్గుతున్నాయని నివేదికలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో మారుతి సుజుకి బాలెనో నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా ఆటో మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇవే నంబర్స్‌ కొనసాగితే అమ్మకాల్లో హ్యాచ్‌బ్యాక్స్‌ మళ్లీ ఇతర సెగ్మెంట్‌ కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లో టాప్‌ 5 కారు సేల్స్‌కి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

మారుతి సుజుకి బాలెనో: మారుతి సుజుకి బాలెనో గత నెలలో 16,293 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 12,961 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు 26 శాతం పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. స్విఫ్ట్, వాగన్ఆర్‌ హ్యాచ్‌బ్యాక్స్‌ని వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచింది.

Maruti Suzuki Baleno November 2024 Sales

ఈ బాలెనో 1197సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 88.5 bhp పవర్, 113 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMTతో జతచేయబడి ఉంటుంది. ఇది సీఎన్‌జీ వెర్షన్‌లోనూ లభిస్తుంది. ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 30.61 కి.మీ భారీ మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ క్రెటా: నవంబర్‌ అమ్మకాల్లో టాప్‌ ఎస్‌యూవీగా ఉంది. గత నెలలో కేవలం 15,452 యూనిట్ల కార్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. గత ఏడాది 17,497 యూనిట్లతో పోల్చితే సేల్స్ తగ్గాయి. ఈ క్రెటా మూడు ఇంజిన్ 1.5 NA పెట్రోల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్‌తో వస్తుంది. మాన్యూవల్ డీజీల్‌ వేరియంట్‌ 21.8 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Tata Punch November 2024 Sales

టాటా పంచ్: ఇది గత కొన్ని నెలలుగా టాప్‌లో కొనసాగుతుంది. గత నెలలో 15,435 యూనిట్ల అమ్మకాలతో 7 శాతం సేల్స్‌ పెరిగాయి. గత ఏడాది నవంబర్‌లో 14,383 యూనిట్లు సేల్‌ అయ్యాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో లభిస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 27 కిమీ మైలేజీని, ఈవీ వెర్షన్‌ 315 కి.మీ నుంచి 421 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది.

టాటా నెక్సాన్: నవంబర్‌లో 15,329 యూనిట్లను విక్రయించడం ద్వారా నెక్సాన్ టాప్ 5 చోటు సంపాదించింది. 2023 నవంబర్‌లో 14,759 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే సేల్స్‌ 3 శాతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ వెర్షన్‌లో లభించే ఏకైక వాహనం కావడం విశేషం. దీని ఈవీ వెర్షన్‌ 325 నుంచి 489 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. డీజీల్‌ వేరియంట్‌ 24 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Maruti Ertiga November 2024 Sales

మారుతి సుజుకి ఎర్టిగా: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీగా ఉంది. నవంబర్‌లో 15,150 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది కేవలం 12.857 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. ఈ ఎర్టిగా పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్‌ 20.51 మైలేజీ, సీఎన్‌జీ మోడ్‌లో 26 కి.మీ మైలేజీని ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2024, 13:03 [IST]
English summary
Top 5 selling cars in november 2024 check models and full sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+