Slavia Style Edition కొనాలంటే.. ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే! డోంట్ మిస్..

స్కోడా ఇటీవల దేశీయ మార్కెట్లో 'స్లావియా స్టైల్ ఎడిషన్' పేరుతో ఓ కొత్త కారు లాంచ్ చేసింది. ఈ కారు కొనాలనుకునే వారు దాని గురించి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ అంశాలను గురించి పరిశీలిద్దాం..

ధర (Price)

భారతీయ మార్కెట్లో స్కోడా కంపెనీ లాంచ్ చేసిన స్లావియా స్టైల్ ఎడిషన్ ధర రూ. 19.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). అంటే ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ స్లావియా వేరియంట్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారుని కంపెనీ కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే ఈ కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Skoda Slavia Style Edition

డిజైన్ (Design)

స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది స్టాండర్డ్ ఎడిషన్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ.. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పక చెప్పడానికి కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా బ్లాక్ అవుట్ బి-పిల్లర్లు, బ్లాక్ మిర్రర్ కవర్స్, బ్లాక్ రూప్ వంటివి ఉన్నాయి. బ్లాక్ అవుట్ పిల్లర్ మీద ఎడిషన్ బ్యాడ్జ్ చూడవచ్చు.

కలర్ ఆప్షన్స్ (Colour Option)

స్లావియా స్టైల్ ఎడిషన్ కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, టోర్నోడా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్ తనకు నచ్చిన కలర్ కారుని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే స్లావియా మ్యాట్ ఎడిషన్, ఎలిగాన్స్ ఎడిషన్ మరియు లావా బ్లూ ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్లను పొందింది. ఈ జాబితాలో ఇప్పుడు స్టైల్ ఎడిషన్ కూడా చేరింది.

Skoda Slavia Style Edition Features

ఇంటీరియర్ & ఫీచర్స్ (Interior and Features)

అద్భుతమైన డిజైన్ కలిగిన స్కోడా స్లావియా అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. స్టైల్ ఎడిషన్ స్టీరింగ్ వీలింగ్ మీద ఎడిషన్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఈ ఎడిషన్ ఇప్పుడు డ్యూయెల్ డాష్ కెమెరా పొందుతుంది. అంతే కాకుండా సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

స్లావియా స్టైల్ ఎడిషన్ డ్యూయెల్ డ్యాష్ కెమెరా, 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మాత్రమే కాకుండా.. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఐసోఫిక్స్ యాంకరింగ్ పాయింట్స్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు పొందుతుంది. ఇవి మాత్రమే కాకుండా స్టాండర్డ్ స్లావియాలోని చాలా ఫీచర్స్ కూడా ఇందులో గమనించవచ్చు. అయితే ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి లోపల కూడా బ్యాడ్జెట్స్ ఉండటం చూడవచ్చు.

ఇంజిన్ (Engine)

స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్‌లో ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఇంజిన్. ఈ ఎడిషన్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 148 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ DSG ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటాయి. ఈ కారు కేవలం 8.96 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 9:00 [IST]
English summary
Top 5 things about new skoda slavia style edition
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+