Toyota Taisorలో తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే! డోంట్ మిస్..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్' దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ కొత్త కారు కొనాలనుకునే వారు తప్పకుండా ఐదు విషయాలు తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఎక్స్టీరియర్ డిజైన్

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త 'టయోటా టైజర్' (Taisor) చూడగానే ఆకర్శించే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఇది మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా రీబ్యాజ్డ్ వెర్షన్. కానీ ఇది టయోటా మాదిరిగా కనిపించడానికి కంపెనీ చాలా మార్పులు చేసింది. ఇందులో హానీ కూంబ్ గ్రిల్, రీ డిజైన్డ్ ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌ మరియు 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

Toyota Urban Cruiser Taisor

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

టయోటా టైజర్ దాదాపు మారుతి సుజుకి ఫ్రాంక్స్ మాదిరిగా ఉండే ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. ఇందులో బ్రౌన్ అండ్ బ్లాక్ అపోల్స్ట్రే చూడవచ్చు. ఫీచర్స్ కూడా దాదాపు ఫ్రాంక్స్‌లో మాదిరిగా ఉంటాయి. ఇందులో 9-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ఇంజిన్

కొత్త టయోటా టైజర్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 89 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. టర్బో పెట్రోల్ యూనిట్ 99 Bhp పవర్ మరియు 148 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్లు మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్ పొందుతాయి.

Toyota Urban Cruiser Taisor Interior

సేఫ్టీ ఫీచర్స్

నిజానికి ఆధునిక కాలంలో చాలామంది వాహన కొనుగోలుదారులు డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయా? అని చూస్తారు. టైజర్ SUVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ధర మరియు ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ SUV.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త SUV ధరలు రూ. 7.5 లక్షల నుంచి రూ. 9.7 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Toyota Urban Cruiser Taisor Rear View

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే టయోటా కంపెనీ ఇప్పుడు టైజర్ లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి.. లెక్కకు మించిన సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. అయితే అమ్మకాల్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2024, 14:00 [IST]
English summary
Top 5 things about new toyota urban cruiser taisor
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+