వస్తున్నాయ్ వస్తున్నాయ్ అదిరిపోయే 5 ఫ్యామిలీ కార్లు.. ఒక్కో కారు ఒక్కో ఆణిముత్యం!

ఇండియాలో కార్ల వాడకం క్రమంగా పెరుగుతుంది. ధనవంతులే కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలు సైతం బడ్జెట్ ధరల్లో కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆదాయ స్థితుల్లో మార్పులు రావడం, ఫ్యామిలీ విహారయాత్రలు పెరగడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఇబ్బంది పడుతూ వెళ్లడం కంటే కారులో సాఫీగా ప్రయాణించడానికి ఆసక్తి చూపించడం వంటి కారణాలతో కుటుంబాలు కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో తయారీ కంపెనీలు కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, వారి ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్లు, అట్రాక్ట్ చేసే డిజైన్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. డిమాండ్ మేరకు కంపెనీలు క్రమంగా ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా త్వరలో మరిన్నింటిని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లో రాబోయే టాప్ 5 ఫ్యామిలీ కార్లను ఒకసారి చూద్దాం.

1. కియా కారెన్స్‌ EV: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా(kia), ఇండియా మార్కెట్లో తమ వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తుంది. అమ్మకాల పరంగా దిగ్గజ కంపెనీలకు పోటీ నిస్తూ కియా కార్లు దూసుకెళ్తున్నాయి. దీంతో కంపెనీ వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. కియా త్వరలో 'కారెన్స్‌ ఈవీ( Carens EV)'అనే కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

Kia Carens Family Car

ఇప్పటికే దీనిని టెస్టింగ్ చేశారు. ఈ కారు వచ్చే ఏడాది అంటే 2025లో లాంచ్ కాబోతోంది. దీని పవర్‌ట్రెయిన్ క్రెటా ఈవీ మాదిరిగా ఉంటుందని తెలుస్తుంది. పనితీరు కూడా సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. 45kWh బ్యాటరీ ప్యాకింగ్ సిప్టంతో, సింగిల్ ఛార్జింగ్‌ ద్వారా ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కుటుంబ వినియోగదారులకు ఇది చాలా మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

2. కియా కారెన్స్‌ ఫేస్‌లిఫ్ట్: కియా నుంచే వస్తున్న కారెన్స్‌ ఫేస్‌లిఫ్ట్(Carens Facelift) మోడల్ 2025 ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అవుతుందని అంచనా. దీని డిజైన్ సరికొత్తగా ఉంటుంది. అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లతో కూడిన కొత్త ఫాసియా, కనెక్ట్ చేయబడిన LED DRLలు, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్‌లను అందించారు. ఫీచర్ల పరంగా, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవల్ 2 ADAS, కొత్త అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

Top 5 Upcoming Family Cars

కారెన్స్‌ ఫేస్‌లిఫ్ట్ కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వస్తుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు కియా విడుదల చేస్తుంది. ఇటీవల నిర్వహించిన టెస్ట్‌లలో మంచి పనితీరును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈ కారులో 10 భద్రత ఫీచర్లను అందించారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, HAC, VSM, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్ట్‌తో 26.03 సెం.మీ HD టచ్‌స్క్రీన్ నావిగేషన్‌ వంటివి ఉన్నాయి.

3. నిస్సాన్ కాంపాక్ట్ ఎంపీవీ: నిస్సాన్(Nissan) కంపెనీ కుటుంబ వినియోగదారుల కోసం రెనాల్ట్ ట్రైబర్ స్పూర్తితో కొత్త కాంపాక్ట్ ఎంపీవీ( MPV)ని తీసుకురాబోతుంది. ఇది కేవలం 4 మీటర్ల కంటే తక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఇంజిన్, గేర్‌బాక్స్, వంటి ఫీచర్లు రెనాల్ట్ ట్రైబర్‌ మోడల్‌ మాదిరిగానే ఉంటాయి. 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది, 72PS శక్తిని, 96‌Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Nissan Upcoming Family Car

4. మహీంద్రా XUV.e8: ఇండియా మార్కెట్లో మహీంద్రా(mahindra) కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్(Ev) SUVని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. XUV.e8 కుటుంబ వినియోగదారులకు బాగా నచ్చుతుంది. 80kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 227-345 bhp పరిధిలో పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రయాణికుల కోసం పెద్ద క్యాబిన్ సదుపాయాన్ని అందించారు. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Mahindra XUV e9

5. మహీంద్రా XUV.e9: ఈ మోడల్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో రాబోతుంది. XUV.e8 తర్వాతి SUV-కూపే వెర్షన్‌గా వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 500 కి.మీ వరకు రేంజ్‌ను అందించే INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ ధర రూ.38 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది. 80 kWh బ్యాటరీతో 350 bhp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ఈ కారులో అందించారు.

Mahindra XUV e9 Ev

More from DriveSpark

Article Published On: Monday, October 21, 2024, 12:48 [IST]
English summary
Top 5 upcoming family cars in india check all details in telugu
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+