మీ డబ్బులు ఆదా చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.. త్వరలో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే!!

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల ట్రెండ్‌ కొనసాగుతుంది. దీంతో ఇతర దేశాల మాదిరిగానే భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్‌ని బట్టి మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య కూడా ఎక్కువ అయ్యింది. ఇప్పటికే వివిధ కార్ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లో విక్రయిస్తున్నారు. త్వరలోనే వీటికి కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి. ఈ కథనంలో త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

టాటా కర్వ్ ఈవీ: 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీల మాదిరిగానే కర్వ్ ఈవీ కూడా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం పరంగా చూస్తే టాటా కర్వ్ ఈవీ లాంచ్ 2024 ఆఖర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 20 లక్షలుగా ఉండనుంది.

టాటా హారియర్ ఈవీ: టాటా హారియర్ ఈవీ కారు కూడా కర్వ్ ఈవీ వలె సరసమైన ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న టాటా హారియర్ కంటే రాబోయే ఈవీ కచ్చితంగా కర్వ్ ఈవీ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ .30 లక్షలుగా ఉండనుంది. సేఫ్టీలో ఈ కారు ప్రస్తుతం నంబర్‌ 1లో ఉంది.

Tata-Curvv-EV

కియా ఈవీ9: ఇండియాలో అమ్మకానికి రానున్న మరో ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ9. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం కియా ఈవీ9 ఈవీని ఈ నెలలో లేదా జూలైలో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఇది కొరియన్ స్టైల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ కారు పరిమాణంలో చాలా పెద్దగా ఉండనుంది. ఈ కారులో 9 మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని ధర రూ. కోటి ఉండనుంది.

మహీంద్రా XUV.e8: టాటా హారియర్ ఈవీకి పోటీగా మహీంద్రా అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది మహీంద్రా XUV 700 ఆధారంగా పనిచేస్తుంది. మహీంద్రా ఈవీ కాన్సెప్ట్‌పై నిర్మించిన మొదటి కారుగాXUV e8 ఉంది. ఈ కారు 2024 చివరి నాటికి విడుదల కావచ్చు. మార్కెట్‌లో ఈ కారుపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని ధర రూ. 35 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ఉండనుంది.

Mahindra-XUV-e8

స్కోడా ఎన్‌యాక్‌ iV: స్కోడా ఆటో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఎన్‌యాక్‌ iV ఈవీని ప్రదర్శించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించబడుతుంది. అందువల్ల, దాని ధర తక్కువగా ఉంటుందని ఆశించలేము. దీని ధర రూ. 65 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

వోల్వో ఎక్స్ 90: ఈ ఏడాది ఈ సంస్థ నుంచి రెండు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కానున్నాయి. వాటిలో ఒకటి వోల్వో ఈఎక్స్ 90 ఒకటి. పవర్ ప్యాక్డ్ 111 కిలోవాట్ల బ్యాటరీతో నడిచే వోల్వో ఎలక్ట్రిక్ కారును 2022 చివరిలో స్వీడన్ సహా ఇతర యూరోపియన్ దేశాలలో విడుదల చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .1.3 కోట్లుగా ఉంటే అవకాశం ఉంది.

Volvo-EX90

మెర్సిడెస్ బెంజ్ EQA: ఎలక్ట్రిక్ బెంజ్ EQA త్వరలోనే భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు తేదీని జూలై 8 2024 గా ప్రకటించారు. సరసమైన ధరలో బెంజ్‌ నుంచి ఈ ఎలక్ట్రిక్ కారును లాంచ్ రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రాలేదు. అయితే ఈ కారు భారతీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2024, 10:59 [IST]
English summary
Top 7 upcoming electric cars in 2024 expected launch dates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+