మంచి మైలేజీ, లగేజీ తీసుకెళ్లేందుకు భారీ బూట్‌స్పేస్‌, తక్కువ మెయింటైనెన్స్‌ కలిగిన ఫేమస్‌ CNG కార్లు ఇవే!

మార్కెట్‌లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్, ఈవీ కార్లతో పోటాపోటీగా సీఎన్‌జీ కార్లను విక్రయిస్తున్నారు. ఇవి మంచి మైలేజీ అందించడమే కారణం. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇవి తక్కువ బూట్‌ స్పేస్‌ని కలిగి ఉంటాయి. దీంతో సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి జనాలు కొంత విముఖత చూపుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సీఎన్‌జీ సిలిండర్లు బూట్‌ స్పేస్‌లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించడం వల్ల స్పేసింగ్ తగ్గుతుంది. దీంతో వస్తువులను తీసుకెళ్లడానికి తగినంత స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ ఆందోళనలను చెక్ పెట్టడానికి టాటా మోటార్స్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని తీసుకువచ్చింది. ఆ వెంటనే హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లలో డ్యూయల్‌ సిలిండర్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల బూట్ స్పేస్‌లో తగినంత స్థలం దొరుకుతుంది. కాబట్టి లగేజీ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ఏయే టాప్‌ మోడళ్లు అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలు మీకోసం..

Tata Tiago Dual Cylinder Setup CNG Car

టాటా టియాగో సీఎన్‌జీ: ఈ కారుని ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేశారు. ఈ సీఎన్‌జీ కారు ధర రూ .5.99 లక్షల నుంచి రూ .8.75 లక్షల ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) మధ్య ఉంది. ఇది దేశంలోనే AMT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి సీఎన్‌జీ కారు కూడా ఇదే కావడం గమనార్హం. ఇది కిలో సీఎన్‌జీకి 26.49 కి.మీ మైలేజీని ఇస్తుంది.

టియాగో సీఎన్‌జీ భారీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది-స్పీకర్ల ఆడియో సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ని ఇందులో అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 73 bhp పవర్, 95 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ కలవు.

Hyundai Grand i10 Nios Dual Cylinder Setup CNG Car

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ: దీనిలో ముందుగా సింగిల్‌ సిలిండర్‌ మాత్రమే ఉండేది. తర్వాత అప్‌డేటెడ్‌ ట్విన్ సిలిండర్ సెటప్‌ని తీసుకువచ్చారు. దీని ధర రూ .7.68 లక్షల నుంచి రూ .8.23 లక్షల ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) మధ్యలో ఉంది. అయితే ఈ ట్విన్‌ సిలిండర్‌ కేవలం మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ సీఎన్‌జీ కిలోకి 27 కి.మీ మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ: డ్యూయల్ సీఎన్‌జీ సిలిండర్ టెక్నాలజీతో ఈ సబ్-కాంపాక్ట్ సెడాన్‌ని హ్యుందాయ్‌ అప్‌డేట్‌ చేసింది. ఇది E, S, SX అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.7.48 లక్షల నుంచి రూ.9.04 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. ఈ సీఎన్‌జీ వెర్షన్ కారు కిలోకి 28 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Tata Nexon Dual Cylinder Setup CNG Car

టాటా నెక్సాన్ సీఎన్‌జీ: ఈ సీఎన్‌జీ వెర్షన్‌ని మొత్త 12 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధరలు రూ.9.0 లక్షల నుంచి ప్రారంభమై రూ.14.60 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉన్నాయి. ఇది టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొట్ట మొదటి సీఎన్‌జీ మోడల్‌గా ఉంది. ఇది సీఎన్‌జీ కార్లలోనే ప్రీమియం కారుగా ఉంది. ఈ సీఎన్‌జీ కారు 24 కిమీ మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ సీఎన్‌జీ: డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన తొలి సీఎన్‌జీ కారు ఇదే కావడం విశేషం. ఇది S, SX, SX నైట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధరలు రూ .8.50 లక్షల నుంచి రూ .9.38 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. కిలో సీఎన్‌జీకి ఈ కారు 27.1 కిమీ మైలేజీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2024, 19:05 [IST]
English summary
Top cng cars with dual cylinder technology check price and models
Read more on: #auto news #cng #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+