భారత్‌లో లభించే సరసమైన 5 ఆటోమాటిక్ కార్లు ఇవే!.. చూసారా

భారతీయ మార్కెట్లో SUVలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన కార్లను డిమాండ్ పెరుగుతోంది. ఈ కథనంలో సరసమైన ధర వద్ద లభించే టాప్ 5 ఆటోమాటిక్ SUVల గురించి తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నైట్ చెప్పుకోదగ్గ మోడల్. ఇది భారతదేశంలో సరసమైన ధర వద్ద లభిస్తున్న సబ్ 4 మీటర్ SUVలలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా.. ఆటోమాటిక్ వేరియంట్ ధర రూ. 6.60 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Nissan Magnite EZ Shift

ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఈజెడ్ షిఫ్ట్ వేరియంట్ 71 Bhp పవర్ మరియు 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)

రెనాల్ట్ కంపెనీకి చెందిన కైగర్ కూడా దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యత్తం ఆటోమాటిక్ SUV. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పవర్‌ట్రెయిన్ నిస్సాన్ మాగ్నైట్ కారుకు దాదాపు సమానంగా ఉంటుంది. రెనాల్ట్ కైగర్ ఆర్ఎక్స్ఎల్ ఆటోమాటిక్ 1.0 లీటర్ ఎనర్జీ ధర రూ. 7.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

Renault Kiger

టాటా పంచ్ (Tata Punch)

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి టాటా పంచ్. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు, ఇప్పటికీ గొప్ప అమ్మకాలను పొందగలుగుతోంది. దీనికి కారణం మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండటం కూడా.

రూ. 7.60 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే టాటా పంచ్ ఆటోమాటిక్ వేరియంట్ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 84.5 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ మాదిరిగానే 5 స్పీడ్ ఆటోమాటిక్ యూనిట్ పొందుతుంది.

Hyundai Exter

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)

హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ కూడా దేశీయ విఫణిలో అత్యంత సరసమైన ధర వద్ద లభిస్తున్న ఆటోమాటిక్ SUV. ఇది భారతీయ మార్కెట్లో టాటా పంచ్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఎక్స్‌టర్ యొక్క ఆటోమాటిక్ వేరియంట్ ధరలు రూ. 8.23 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ మోడల్ కూడా ఎక్కువ అమాంకాలను పొందుతూ కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 81.5 Bhp పవర్ మరియు 113.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా పంచ్ మాదిరిగానే హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Maruti Fronx

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల కంపెనీలలో ఒకటి మారుతి సుజుకి. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు దేశీయ విఫణిలో కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే సంస్థ ఫ్రాంక్స్ SUVని కూడా లాంచ్ చేసింది. ఫ్రాంక్స్ ఆటోమాటిక్ వేరియంట్ ధరలు రూ. 9.27 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 88.5 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ పైన పేర్కొన్న ఇతర కార్ల మాదిరిగానే 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2024, 11:58 [IST]
English summary
Top five affordable automatic suvs in indian market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+