రూ.15 లక్షలుంటే చాలు.. ఇలాంటి కార్లు కొనేయొచ్చు
మనిషి ఎదిగే క్రమంలో తప్పకుండా బైక్ కావాలనుకుంటాడు, కారు కొనాలని కలలు కంటాడు. అయితే కొంతమందికి ఈ కల నిజమవుతుంది. మరికొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. కొంతమంది రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో ఓ కారు కొనాలనుకుంటారు. మరి కొందరు ఓ 15 లక్షల రూపాయలతో కారు కొనాలని ఆలోచిస్తారు. రూ. 15 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని ఉత్తమమైన కార్లు ఏవి? వాటి డిజైన్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే మరిన్ని వివరాలను గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
హోండా ఎలివేట్
రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమమైన కార్లలో హోండా కంపెనీకి చెందిన ఎలివేట్ ఒకటి. దీని ధర దేశీయ విఫణిలో రూ. 11.69 లక్షల నుంచి రూ. 16.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 121 పీఎస్ పవర్ మరియు 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. వేరియంట్లను బట్టి 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.

మంచి డిజైన్ కలిగిన హోండా ఎలివేట్ 5 మంది ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) కూడా పొందుతుంది. ఇది 15.31 కిమీ/లీ నుంచి 16.92 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా
రూ. 11.00 లక్షల నుంచి రూ. 20.15 లక్షల మధ్య లభించే హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారు 17.4 కిమీ /లీ నుంచి 21.8 కిమీ/ లీ మైలేజ్ అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటాలో ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.25 ఇంచెస్ డ్యూయెల్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం వంటి అనేక ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇది సేఫ్టీ పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి మారుతి సుజుకి గ్రాండ్ విటారా. దీని ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. అనేక ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క స్కార్పియో క్లాసిక్ కూడా రూ. 15.00 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఒక ఉత్తమ మోడల్. దీని ధర రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
రూ. 11.14 లక్షల నుంచి రూ. 20.19 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభించే టయోటా యొక్క అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువమందిని ఆకర్శించిన మరియు ఉత్తమ ఫీచర్స్ కలిగిన బెస్ట్ ,మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు CNG ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 19.39 కిమీ/లీ నుంచి 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








