నగర ప్రయాణానికి కరెక్ట్ ఆప్షన్.. ఇదిగో బెస్ట్ కార్లు.. ధర చాలా తక్కువే!
బెంగళూర్, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా మొదలైన నగరాల్లో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం. ప్రతి ఒక్కరూ సొంతంగా వాహనం కలిగి ఉండాలి అనుకోవడంతో దాదాపు చాలామంది సొంతంగా బైక్, లేదా కారును కలిగి ఉన్నారు. ఇది నగరాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యగా మారిపోతోంది. నగరాల్లో కొంతమంది మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లకంటే.. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్ల కొనుగోలుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నారు. ఈ కథనంలో మార్కెట్లో లభిస్తున్న సరసమైన హ్యాచ్‌బ్యాక్‌ల గురించి తెలుసుకుందాం.
మారుతి ఆల్టో కే10
నిజానికి మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు మారుతి సుజుకి యొక్క ఆల్టో కే10. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది 24.09 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్
కొంత తక్కువ ధరలో లభించే ఉత్తమ కార్ల విభాగంలో మరో బెస్ట్ మోడల్ రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్. దీని ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 67 పీఎస్ పవర్ మరియు 91 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 22.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో
రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభించే మరో హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి యొక్క ఎస్ ప్రెస్సో. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 67 పీఎస్ పవర్ మరియు 89 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 25.30 కిమీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో
భారతీయ విఫణిలో కొంత తక్కువ ధరలో లభించే మరో సరసమైన కారు మారుతి సెలెరియో. ఈ కారు ధరలు రూ. 4.99 లక్షల నుంచి రూ. 7.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది.
టాటా టియాగో
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క టియాగో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.56 లక్షల నుంచి రూ. 8.90 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ రెండూ కూడా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్ 19.43 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. CNG మోడల్ 28.06 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

భారతదేశంలో ప్రస్తుతం తక్కువ ధర వద్ద లభించే కార్లు మాత్రమే కాకుండా.. అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రద్దీగా ఉండే నగరాల్లో రోజువారీ ప్రయాణానికి హ్యాచ్‌బ్యాక్ కార్లు చాలా ఉత్తమమైనవి చాలామంది భావిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా సరసమైన కార్లను లాంచ్ చేస్తున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








