వరద నీళ్లలో సైతం రయ్‌ మని దూసుకుపోయే టాప్ 5-SUVలు ఇవే

ఇటీవల కాలంలో దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రోడ్లన్ని కూడా నీటితో నిండి పోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై నడుము లోతు నీళ్ల వరద పారింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్లను నడపడం చాలా కష్టం. వరద నీరు కారులోకి చేరి దాని ఇంజిన్ పనితీరును బాగా దెబ్బతీస్తుంది. అయితే దీని నుంచి బయటపడటానికి వరదలున్న రోడ్లను సులభంగా దాటడంలో అధిక నీటి వెండింగ్(water wading)) సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎస్‌యూవీ(SUV)లు బాగా ఉపయోగపడుతాయి. ఈ కార్లు ఎక్కువ నీటి గుంతలు లేదా పెద్ద వరదలో సైతం ఈజీగా ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. అయితే వరదలో కూడా సాఫీగా ప్రయాణించే టాప్ 5- SUVలను ఒకసారి చూద్దాం..

టయోటా ఫార్చ్యూనర్: టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్(Toyota Fortuner) డ్రైవింగ్‌లో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా సాహసాలను కోరుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది. వరదలు ఉన్న ప్రాంతాల్లో సులభంగా ప్రయాణించేలా 700 మి.మీ వాటర్ వాడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా బలంగా, దృఢమైన నిర్మాణంతో ఉంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.

Toyota Fortuner Highest Water Wading Capacitiy

దీంతో ఎత్తుపల్లాలు, గుంతలు, వరదలు వంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. కారు లోపల కూర్చున్న ప్రయాణికులకు సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో 4x2, 4x4 వెర్షన్లలో అందుబాటులో ఉంది. లగ్జరీ, బలమైన పనితీరును కోరుకునే వారికి టయోటా ఫార్చ్యూనర్ SUVలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్: చూడటానికి లగ్జరీ మోడల్‌ లుక్‌ను కలిగి ఉండి, భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ల్యాండ్ రోవర్ డిఫెండర్(Land Rover Defender) ముందు వరుసలో ఉంటుంది. ఇది 900 మిల్లీమీటర్ల అత్యంత ఆకట్టుకునే వాటర్-వాడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో ఎలాంటి రోడ్లపైన కూడా చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన రోడ్లపై కూడా డిఫెండర్‌తో దూసుకుపోవచ్చు.

Land Rover Defender Water Wading

ఈ SUVకి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. లోతైన నీటి ప్రాంతాలలో సాఫీగా ప్రయాణం సాగిస్తోంది. ఈ కారు కూడా అధునాతన 4x4 సిస్టమ్‌తో వచ్చింది. వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వారికి ఇది బాగా సెట్ అవుతుంది. చాలా మంది సాహసయాత్రల కోసం ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను ఎంచుకుంటారు. మంచి లుక్, లోపల ఉన్న అదిరిపోయే ఫీచర్లతో లగ్జరీ ఫీలింగ్‌ను డిఫెండర్ అందిస్తుంది.

జీప్ రాంగ్లర్: అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉన్న జీప్ రాంగ్లర్(Jeep Wrangler) ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది 863 మిల్లీమీటర్ల వరకు వాటర్-వాడింగ్ డెప్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో లోతైన వరద నీటిలో సులభంగా దూసుకుపోతుంది. అన్ని రకాల రోడ్లపై ఎలాంటి వాతావరణ పరిస్థితులలో అయిన ప్రయాణించడానికి రాంగ్లర్ బాగా పేరుగాంచింది. దీని కఠినమైన బాడీ నిర్మాణం వరద నీటిలో ఏ డ్యామేజ్ లేకుండా ప్రయాణించేలా చేస్తుంది.

SUVs With Highest Water Wading Capacities

జీప్ రాంగ్లర్ SUV 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఆఫ్-రోడ్ ఫీచర్లతో స్టాండర్డ్‌గా వస్తుంది. వాటర్-వాడింగ్ డెప్త్ సామర్ధ్యం పరంగా చూసినట్లయితే ఇది ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. వర్షాలు, వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల వారికి రాంగ్లర్ చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫోర్స్ గూర్ఖా: ఈ SUV 700 మిల్లీమీటర్ల వాటర్ వాడింగ్ కెపాసిటీతో అన్ని రకాల కఠిన పరిస్థితులను తట్టుకుని లోతైన వరద నీళ్లలో సైతం చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. నీటితో నిండిన ప్రాంతాల గుండా వెళ్లడానికి చాలా మందికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫోర్స్ గూర్ఖా(Force Gurkha) మహీంద్రా థార్ కంటే 50 మిల్లీమీటర్ల ఎక్కువ నీటి వాడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Force Gurkha Water Wading

దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నీళ్ల మధ్యలో నిలిచిపోకుండా సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది. దీని బాడీ చాలా కఠినంగా ఉంటుంది.బలమైన పనితీరుకు పేరుగాంచిన ఫోర్స్ గూర్ఖా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంది.

మహీంద్రా థార్: వరదల సమయంలో ఈజీగా ప్రయాణించడానికి అనువుగా ఉండే వాటిలో మహీంద్రా థార్(Mahindra Thar) కూడా ఒకటిగా ఉంది. ఇది 650 మిల్లీమీటర్ల వాటర్-వాడింగ్ కెపాసిటీతో సవాలుతో కూడిన పరిస్థితుల్లో దూసుకుపోతుంది. వరద నీటిలో వ్యక్తులు, వస్తువుల రవాణాను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

Mahindra Thar Water Wading

More from DriveSpark

Article Published On: Thursday, October 17, 2024, 13:24 [IST]
English summary
Top five suvs with highest water wading capacities check details in telugu
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+