Skoda Epiq గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు - ఇవే!
ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థ 'స్కోడా' గ్లోబల్ మార్కెట్లో మరో కొత్త కారు 'ఎపిక్' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ తన ఉనికిని విస్తరించడమే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. కస్టమర్లకు కావాల్సిన ఫీచర్స్ అందిస్తూ.. చూడగానే ఆకర్శించబడే డిజైన్‌తో కంపెనీ తన కార్లను అందిస్తోంది. దీంతో బ్రాండ్ వాహనాలకు ఆదరణ పెరుగుతూనే ఉంది.

డిజైన్ (Design)
విడుదలకు సిద్దమవుతున్న కొత్త స్కోడా ఎపిక్ డిజైన్ విషయానికి వస్తే.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొత్తగా అనిపిస్తుంది. లేటెస్ట్ సాలిడ్ డిజైన్ కలిగిన ఈ కారు కుషాక్ మాదిరిగానే 4.1 మీటర్ల పొడవు ఉంటుందని తెలుస్తోంది. నిటారుగా ఉండే ఫ్రంట్ ప్రొఫైల్.. స్కోడా సిగ్నేచర్ గ్రిల్ డిజైన్ చూడవచ్చు. అయితే ఇక్కడ బ్రాండ్ లోగోకు బదులుగా స్కోడా (SKODA) అని ఉండటం చూడవచ్చు.
వెనుక భగంలో నిలువగా ఉన్న 8 స్లాట్స్, టీ షేప్ ఎల్ఈడీ ఎలిమెంట్లతో కూడిన ఫ్రంట్ సెక్షన్, స్పోర్టి క్లామ్‌షెల్ బానెట్ వంటివి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఛంకీ వీల్ ఆర్చెస్, రూఫ్ టెయిల్ మరియు ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

డైమెన్షన్స్ (కొలతలు)
డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కొత్త స్కోడా ఎపిక్ ఎలక్ట్రిక్ కారు పరిమాణం పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సుమారు 4.1 మీటర్ల పొడవును కలిగిన ఈ కారు పెద్ద బూట్ స్పేస్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. బూట్ స్పేస్ 490 లీటర్ల వరకు ఉంటుంది. ఇది ఇప్పటికే అమ్మకానికి ఉన్న స్కోడా కుషాక్ కంటే 105 లీటర్లు ఎక్కువని తెలుస్తోంది.
రేంజ్ (పరిధి)
స్కోడా ఎపిక్ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా పట్టణవాసులను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. అయితే ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే ఖచ్చితమైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయని తెలుస్తోంది. అయితే ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంటీరియర్ ఫీచర్స్
ఇక ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. ఇది ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు 5.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి వాటిని పొందుతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








