లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు ఇవే - కియా క్లావిస్, టయోటా టైసర్ ఇంకా..
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ కథనంలో రూ. 10 లక్షల లోపు ధర వద్ద దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఐదు కార్లను గురించి, వాటికి సంబంధించిన ఇతర వివరాలను వివరంగా తెలుసుకుందాం..
పెద్ద ఎస్‌యూవీలు, ఎంపీవీలకు మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు రానున్న రోజుల్లో కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి లేటెస్ట్ డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్లతో కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో కియా, టయోటా, మహీంద్రా, స్కోడా మరియు మారుతి సుజుకి వంటి చెప్పుకోదగ్గ కంపెనీలు ఉన్నాయి.

కియా క్లావిస్ (Kia Clavis)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ యొక్క 'క్లావిస్' కాంపాక్ట్ ఎస్‌యూవీ 2025లో దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ 2024 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లో ప్రారంభమవుతుందని, ఆ తరువాత భారతీయ తీరాలను చేరుకునే సూచనలు ఉన్నాయని సమాచారం. కొరియాలో టెస్టింగ్ దశల్లో కనిపించిన కియా క్లావిస్ త్వరలోనే మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్దమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
న్యూ స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ (New Skoda Compact SUV)
స్కోడా కంపెనీ కూడా ఇండియా 2.5 స్ట్రాటజీలో భాగంగా.. దేశీయ మార్కెట్లో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారుని కంపెనీ వచ్చే ఏడాది (2024) ఏ సమయంలో అయినా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ దాదాపు 90శాతం స్థానీకరణ ఉత్పత్తిగా తయారవుతుందని సమాచారం. అయితే ఎగుమతులు కూడా భారత్ నుంచే జరిగే అవకాశం ఉంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ (Maruti Suzuki Micro SUV)
ఇప్పటికే టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటివి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి కూడా ఓ మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కంపెనీ రాబోయే మైక్రో ఎస్‌యూవీ గురించి ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. రానున్న రోజుల్లో కంపెనీ లాంచ్ చేసే ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' త్వరలో అప్డేటెడ్ ఎక్స్‌యువి300 కారుని ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఈ కారు అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు ఈ ఏడాది మార్చి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ కారు యొక్క అధికారిక ధరలు తెలియాల్సి ఉంది.

టయోటా టైసర్ (Toyota Taisor)
మన జాబితాలో చెప్పుకుంటున్న ఐదు కార్లలో 'టయోటా' కంపెనీకి చెందిన 'టైసర్' ఒకటి. ఇది 2024 ప్రథమార్థంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొంత వరకు మారుతి ఫ్రాంక్స్ మీద ఆధారపడి ఉంటుంది, కావున అండర్‌పిన్నింగ్స్ మరియు పవర్‌ట్రెయిన్స్ అన్నీ కూడా ఫ్రాంక్స్‌తో పంచుకోబడతాయని తెలుస్తోంది. అయినప్పటికీ రాబోయే కొత్త టయోటా టైసర్ గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








