లాంచ్‌కు సిద్దమవుతున్న డీజిల్ కార్లు.. ఇవే - ఓ లుక్కేసుకోండి
దేశీయ మార్కెట్లో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన డీజిల్ కార్ల ఉత్పత్తి ఆధునిక కాలంలో బాగా తగ్గిపోయింది. దీంతో కొన్ని సంస్థలు మాత్రమే ఇప్పటికీ డీజిల్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రాబోయే టాప్-5 డీజిల్ కార్లను గురించి తెలుసుకుందాం.
టాటా కర్వ్ (Tata Curvv)
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) మార్కెట్లో విడుదల చేయనున్న 'టాటా కర్వ్' ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయిన తరువాత డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మధ్యలో విడుదలకానున్న ఈ SUV 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని, ఇది 114 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం.

మహీంద్రా థార్ (Mahindra Thar)
మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్లిన మహీంద్రా థార్ త్వరలోనే 5 డోర్ వెర్షన్‌లో లాంచ్ కానుంది. ఇది కూడా ఈ ఏడాది మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్కార్పియో-ఎన్ యొక్క ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ మీద ఆధారపడిన థార్ 5 డోర్ వెర్షన్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో రానున్నట్లు సమాచారం.
మహీంద్రా థార్ 5 డోర్ దాని మునుపటి మోడల్ కంటే పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందనుంది. త్వరలో లాంచ్ కానున్న ఈ కారు 4X4 డ్రైవ్‌ట్రైన్‌తో వస్తాయని భావిస్తున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
మహీంద్రా కంపెనీ లాంచ్ చేయనున్న మరో డీజిల్ మోడల్ ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్. ఈ కారు ఇప్పటికే కలిగి ఉన్న ప్రస్తుత ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందనున్నట్లు సమాచారం. ఇక డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది కొంత అప్డేట్స్ పొంది ఉంటుందని తెలుస్తోంది.
కియా కార్నివాల్ (Kia Carnival)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ కూడా త్వరలోనే అప్డేటెడ్ కార్నివాల్ MPVని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. విడుదలకు సిద్దమవుతున్న కొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందనున్నట్లు సమాచారం. రాబోయే కియా కార్నివాల్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar Facelift)
హ్యుందాయ్ కంపెనీ కూడా తన అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ కారును డీజిల్ ఇంజిన్‌తో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లను పొందనుంది. చూడటానికి స్టాండర్డ్ అల్కజార్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో ట్విన్ స్క్రీన్ లేఅవుట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








