భారత్లో లాంచ్ కానున్న స్కోడా కొత్త కార్లు ఇవే!.. చూశారా?
ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉంది. దాదాపు అన్ని కంపెనీలు తమ ఉనికిని చాటుకోవడానికి మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు చేరువయ్యేందుకు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే భారతదేశంలో మంచి ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇప్పటికే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి.. గొప్ప అమ్మకాలను పొందుతోంది. కాగా రాబోయే రోజుల్లో కంపెనీ మరో ఐదు మోడల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
స్కోడా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ
దేశీయ మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్న కొత్త స్కోడా కార్లలో ఒకటి సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ. ఇది దాదాపు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాబట్టి 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లు అన్నీ కూడా స్కోడా కుషాక్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.

స్కోడా కొత్త సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 9 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
న్యూ స్కోడా సూపర్బ్
స్కోడా సూపర్బ్ అనేది భారతదేశంలో ఒక విజయవంతమైన మోడల్‌గా. ఇప్పటికే కంపెనీ స్కోడా కొత్త తరం సూపర్బ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇక భారతదేశంలో లాంచ్ చేయడమే ఆలస్యం. ఒకప్పుడు మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన స్కోడా సూపర్బ్ ఇప్పుడు మరిన్ని ఆధునిక హంగులతో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. కాబట్టి ఇది మంచి డిజైన్ కలిగి.. మునుపటి మోడల్ కంటే కూడా 43 మిమీ పొడవుగా ఉంటుంది.

స్కోడా సూపర్బ్ న్యూ జనరేషన్ మోడల్ మంది డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో 13 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ మరియు పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
స్కోడా ఆక్టావియా వీఆర్ఎస్
భారతదేశంలో స్కోడా కంపెనీ లాంచ్ చేయనున్న మరో కారు ఆక్టావియా వీఆర్ఎస్. ఇది బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్ మరియు షార్ప్ హెడ్‌ల్యాంప్ డిజైన్ పొందుతుంది. సూపర్బ్ లాంచ్ అయిన తరువాత కంపెనీ ఈ కారును లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 241 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

న్యూ స్కోడా కోడియాక్
స్కోడా కోడియాక్ కూడా ఆధునిక హంగులతో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 61 మిమీ పొడవుగా ఉంటుంది. ఇది కొత్త గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ 12.9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పొందుతుంది. ఈ కారులో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
భారతదేశంలో లాంచ్ కానున్న ఈ కొత్త స్కోడా కోడియాక్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే అందించబడుతుందని సమాచారం. ఇది 2024 ద్వితీయార్థంలో ఎప్పుడైనా లాంచ్ కావచ్చు. దీని ధర రూ. 50 లక్షల నుంచి రూ. 55 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఖచ్చితమైన ధరలు మరియు లాంచ్ డీటైల్స్ అన్నీ కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది.
స్కోడా ఎన్యాక్ iV
ప్రస్తుతం స్కోడా యొక్క ఎన్యాక్ అనేది టెస్టింగ్ దశలో ఉంది. కాబట్టి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. మంచి డిజైన్ కలిగిన ఈ కారు 13 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ అపోల్స్ట్రే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. దీని ధర రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన ధరలు తెలియాల్సి ఉంది.
కొత్త స్కోడా ఎన్యాక్ iV కారు 77 కిలోవారు బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 512 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రేంజ్ వివరాలు కూడా లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇది చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








