మార్కెట్‌లో మంచి కార్లు.. అమ్మకాల్లోనూ వీటిని మించిన కార్లు లేవు మావ!
భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఈ రకం కార్లను కొనుగోలు చేయడానికి జనాలు ఎక్కువ సంఖ్యలో ఇష్టపడుతుంటారు. దీంతో ప్రతినెలా లక్షల సంఖ్యలో హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడవుతూ ఉంటాయి. ఇవి తక్కువ ధరకు లభించడం వల్ల జనాలు వీటికే ఎక్కువ మొగ్గుచూపుతారు. SUV లు, సెడాన్స్, ఎంపీవీలతో పోల్చితే హ్యాచ్‌బ్యాక్ కార్లు నిత్యం వందల సంఖ్యలో కనిపిస్తాయి. ప్రస్తుతం మారుతి సుజుకి అనేక రకాల హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయిస్తోంది. గత నెల సెప్టెంబర్‌లో ఏ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
ఈ జాబితాలో టాటా ఆల్ట్రోజ్ 10వ స్థానంలో ఉంది. ఇది నెలలో 2,758 యూనిట్లు, ఆగస్టులో మాత్రం 3,031 యూనిట్లను విక్రయించింది. ఈ లెక్కన ఆల్ట్రోజ్ ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో 273 యూనిట్లను తక్కువగా విక్రయించింది. ఆ తర్వాత మారుతి సుజుకి సెలెరియో, టయోటా గ్లాంజా 9, 8 స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్‌లో వీటి అమ్మకాల సంఖ్య వరుసగా 3,241, 3,246 యూనిట్లుగా ఉంది.

అ తర్వాత టాటా టియాగో/ఈవీ, హ్యుందాయ్ ఐ20 7, 6 స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్‌లో ఇవి వరుసగా 4,225, 4,428 యూనిట్లను విక్రయించింది. ఇక హ్యుందాయ్ ఐ10 నియోస్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. గత నెలలో ఐ10 నియోస్ మొత్తం 5,103 యూనిట్లు అమ్ముడవ్వగా. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 2024 ఆగస్టులో 5,365 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఈ జాబితాలో మొదటి నాలుగు కార్లు వరుసగా నాలుగు మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్స్ ఉన్నాయి. అవి మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, వ్యాగన్ ఆర్, ఆల్టోగా ఉన్నాయి. మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ కార్లు నంబర్ 1గా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ విభాగాన్ని మారుతి కార్లు ఏలుతున్నాయి. ఇక వీటి సేల్స్ విషయానికి వస్తే గత నెలలో మారుతి ఆల్టో 8,655 యూనిట్లను విక్రయించింది.

ఆగస్టులో ఆల్టో కార్ల అమ్మకాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత మూడవ స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఉంది. గత నెలలో మారుతి మొత్తం 13,339 యూనిట్లను విక్రయించింది. ఇక ఇదే కారు ఆగస్టులో 16,450 యూనిట్లను విక్రయించింది. గత నెలలో వ్యాగన్‌ఆర్ అమ్మకాలు 3,111 యూనిట్లు క్షీణించాయి.
మొత్తం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి సుజుకి బాలెనో రెండో స్థానంలో ఉంది. బాలెనో గత నెలలో 14,292 యూనిట్లను విక్రయించింది. ఆగస్టులో బాలెనో 12,485 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ నెల 1,807 బాలెనో కార్లు తక్కువగా అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ 16,241 యూనిట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆగస్టులో స్విఫ్ట్ 12,844 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతి స్విఫ్ట్‌కి ఉన్న మాస్ ఇమేజ్ అలాగే ఇతర టాప్ 4 కార్లు దుమ్మురేపనున్నాయి. దీనికి కారణం దీపావళి పండుగ సీజన్ అని చెప్పవచ్చు. వీటితో పాటు మార్కెట్‌లో ఎంపీవీలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ రెండిటి మధ్య పోటీలో హ్యాచ్‌బ్యాక్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








