గుంతల రోడ్లలో చింత లేని ప్రయాణం.. అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగిన కార్లు ఇవే!

మార్కెట్‌లో కార్లను కొనుగోలు చేసే ముందు కొంతమంది గ్రౌండ్ క్లియరెన్స్‌ని చూస్తూ ఉంటారు. గుంతలు, ఇతర ఎత్తైన ప్రదేశాల్లో ఖరీదైన కార్లతో వెళ్లడం వల్ల కారులోని కింది భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కావున గ్రౌండ్ క్లియరెన్స్ తగినంత లేకుంటే ఇలాంటి ప్రదేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. తద్వారా మీ ప్రయాణం మీకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. గుంతలు, రోడ్ల మధ్యలో ఉండే ర్యాంప్స్‌, స్పీడ్ బ్రేకర్ల వద్ద గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కీలకంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో మీ ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కలిగిన కార్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ప్రస్తుతం కారు కొనేముందు జనాలు రూ.10 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్‌ పెట్టడానికి ఇష్టపడటం లేదు. దీనిని ఓ బెంచ్‌మార్క్‌గా కస్టమర్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ధర వద్ద అందుబాటులో ఉన్న కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రూ.10 లక్షల లోపు మార్కెట్‌లో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ అందించే ఐదు బడ్జెట్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో..

Mahidnra XUV 3Xo Ground Clearance

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO: ఈ మహీంద్రా కారుని కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇందులో భారీ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇటీవలె గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఈ ఎక్స్‌యూవీ 201 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఈ మోడల్ ధర రూ.7.79 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్‌ సంవత్సరం పైనే ఉంది.

కియా సోనెట్: ఈ ఏడాది జనవరిలో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ ఎస్‌యూవీ 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. తద్వారా గుంతల రోడ్లు, ఇతర కఠినమైన రోడ్లలో మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరీయన్స్‌ని అందిస్తుంది. ఈ సోనెట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కియా నుంచి ఈ కారు ఎక్కువ అమ్మకాలను రాబడుతోంది.

Kia Sonet Ground Clearnce

నిస్సాన్ మాగ్నైట్: ఈ సంస్థ నుంచి బెస్ట్‌ సెల్లింగ్‌ కారుగా ఉంది. ఇటీవలె దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కూడా మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ ఎస్‌యూవీ సైడ్‌ ఫ్రొఫైల్‌ చూడటానికి కాస్త చిన్నగా కనిపిస్తుంది. అయినా కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నిస్సాన్‌ మాగ్నైట్ 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షలుగా ఉంది.

రెనాల్ట్ కిగర్: మాగ్నైట్ ఎస్‌యూవీకి వలె రెనాల్ట్ కిగర్ కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. ఇది కూడా నిస్సాన్‌ వలె 205 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువగా ప్రజలు దీనినే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైన ఎస్‌యూవీలలో ఇది ఒకటిగా ఉంది.

Renault Kiger Ground Clearance

టాటా నెక్సాన్: రూ .10 లక్షల లోపు ఎస్ యూవీల జాబితాలో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఎస్ యూవీ టాటా నెక్సాన్. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ .8 లక్షలు మరియు 208 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ లోని అన్ని ప్రత్యర్థుల కంటే అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు భద్రత కారణంగా ఈ మోడల్ విజయం సాధించింది. నెక్సాన్ ను పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ సిఎన్ జి ఇంజన్ ఆప్షన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2024, 15:36 [IST]
English summary
Top suvs under 10 lakhs with highest ground clearance
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+